మెగా ట్యాగ్ తగిలించుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన అందరికీ ఆయనే ‘ది బెస్ట్’.. ఎందుకంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు .. బోలెడు మంది హీరోలు స్వయాన టాలెంట్ ఉపయోగించుకొని ఇండస్ట్రీలోకి వచ్చారు .. మరికొందరు తాత పేర్లు నాన్న పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చారు . ఎవరు ఏ పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళల్లో టాలెంట్ లేకపోతే అస్సలు జనాలు లైక్ చేయరు. దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ మెగా హీరోస్ . మెగా ట్యాగ్ తగిలించుకొని ఇండస్ట్రీలోకి ఎంతమంది హీరోలు వచ్చారో మనకు తెలిసిందే .

కానీ వాళ్ళల్లో సక్సెస్ అయ్యింది మాత్రం చాలా తక్కువ . ఇద్దరూ ముగ్గురు అంతే.. మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ కంటే కూడా అభిమానులకి సాయిధరమ్ తేజ అంటే విపరీతమైన పిచ్చి.. ఇష్టం. ఆ విషయాన్ని పలు ఇంటర్వ్యూలలో ఓపెన్ గా చెప్పుకు వచ్చేసారు ఫ్యాన్స్. దానికి కారణం సాయిధరమ్ తేజ్ పెర్ఫార్మెన్స్ .

చూస్ చేసుకునే సినిమాలే .. సాయిధరమ్ తేజ్ ఇప్పటివరకు నటించిన సినిమాలు చూసుకుంటే ఏ సినిమాలో తన క్యారెక్టర్ ను రిపీట్ చేయలేదు . డిఫరెంట్ డిఫరెంట్ గా మెసేజ్ ఓరియెంటెడ్ గానే చూస్ చేసుకుంటాడు . తన పాత్ర ద్వారా సినిమాలలో ఎంటర్టైన్ చేశామా ..? లేదా ..? అన్న విషయాన్ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాడు . సాయిధరమ్ తేజ్ అందుకే మెగా హీరోలు అందరిలోకి ఆయనే ది బెస్ట్ అంటూ జనాలు చెప్పుకొస్తూ ఉంటారు . రామ్ చరణ్ – అల్లు అర్జున్ – మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు కూడా సాయిధర్మతేజ నటన చూసి చాలా మెస్మరైజ్ అయిపోయాము అని చెప్పుకొచ్చిన సందర్భాలు బోలెడు ఉన్నాయి..!!