హీరోయిన్స్ ని ఐటమ్ సాంగ్ కి ఒప్పించడానికి సుకుమార్ అలా చేస్తాడా…? అందుకే కత్తిలాంటి బ్యూటీ కూడా పడిపోతుందా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేయడం చాలా చాలా కామన్ గా చూస్తూ ఉంటాం . అయితే హీరోయిన్స్ ని ఐటెం సాంగ్స్ కి ఒప్పించడానికి డైరెక్టర్ ముప్పు తిప్పులు పడుతూ ఉంటారు . మరి కొంతమంది రెమ్యూనరేషన్ హై ఇస్తూ వాళ్లకి ఎరవేస్తూ ఉంటారు . కానీ సుకుమార్ మాత్రం తన సినిమాల్లో చేసే ఐటమ్ సాంగ్స్ లో ఉండే హీరోయిన్స్ కి ఎప్పుడు కూడా ఒకే బిస్కెట్ వేస్తూ వస్తారట.

దానికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు ఉన్నారు . కానీ సుకుమార్ సినిమాలో ఐటెం సాంగ్స్ చేసే హీరోయిన్స్ మాత్రం వేరే లెవల్ అనే చెప్పాలి . ఒకరు కాదు ఇద్దరు కాదు ఆయన సినిమాలో ఐటెం సాంగ్స్ చేసిన ప్రతి హీరోయిన్ కెరియర్ ఓ రేంజ్ లో దూసుకుపోతూ ఉంటుంది. కాగా సుకుమార్ తన సినిమాలల్లో ఐటమ్ సాంగ్ చేయడానికి హీరోయిన్స్ కి ప్రతిసారి ఒకే విషయాలు చెప్తారట .

“మీరు మీ కెరియర్ లో ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించినా.. ఈ పాటలో చేస్తే మాత్రం మీకు ఒక స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు గుర్తింపు కూడా లభిస్తుంది” అంటూ హీరోయిన్స్ ని అలా టెంప్ట్ చేసేస్తాడట. ఆ మాట అన్నాక ఏ హీరోయిన్ ఒప్పుకోకుండా ఉంటుంది చెప్పండి. అందుకే పెద్ద పెద్ద హీరోయిన్స్ కూడా సుకుమార్ సినిమాలో ఐటమ్ సాంగ్ అంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. త్వరలోనే రిలీజ్ కాబోతున్న పుష్ప2 సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని చేత ఐటెం సాంగ్ చేయించబోతున్నాడట సుకుమార్ .ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో హిట్ అవ్వడం పక్క అంటున్నారు అభిమానులు..!!