ఇండస్ట్రీలో డైరెక్టర్స్ గా రాణిస్తున్న మన స్టార్ డైరెక్టర్ల శిష్యులు వీళ్లే..

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది డైరెక్ట‌ర్లుగా అడుగుపెట్టి వాళ్ళకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ ఏర్పాటు చేసుకుంటున్నారు. హీరోలకు భారీ సక్సెస్‌లు అందిస్తూ దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌గా క్రేజ్‌ సంపాదించుకున్నాడు పూరీ జగన్నాథ్. హీరోల ఇమేజ్‌కు తగ్గట్టుగా సినిమాలు తెర‌కెక్కించడంలో ఆయన స‌క్స‌స్ సాధించాడు. అలాగే రాజమౌళి, సుకుమార్, వినాయక్ లాంటి ఎంతమంది స్టార్ట్ డైరెక్టర్స్ టాలీవుడ్ స్టార్ హీరోలకు సూపర్ సక్సెస్ లను అందించి స్టార్ డైరెక్టర్లు గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే ఈ డైరెక్టర్ దగ్గర పని చేసిన వాళ్లలో ఎంతోమంది ఇండస్ట్రీలో డైరెక్టర్ గా అడుగుపెట్టారు. దాంట్లో కొంతమంది సక్సెస్ అయ్యారు. కొంతమంది ఫెడవుట్ అయ్యారు. అలా వీరి శిష్యులుగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన‌ దర్శకుల లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

రాజమౌళి


రాజమౌళి దగ్గర పనిచేసిన వాళ్లలో కరుణ కుమార్, త్రికోటిలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే వీళ్ళలో ఓక‌రు కూడా సక్సెస్ సాధించ‌లేక‌పోయారు.

సుకుమార్


సుకుమార్ దగ్గర నుంచి వచ్చిన దర్శకుల్లో బుచ్చిబాబు స‌నా, శ్రీకాంత్ ఓదెల, పల్నాటి సూర్య ప్రతాప్, కార్తీక్ దండు దర్శకులుగా ఉన్నారు. ఇక ప్రస్తుతం వీళ్ళు నలుగురు మంచి దర్శకులుగా పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రి లో ప‌లు సినిమాలు చేస్తూ కొన‌సాగుతున్నారు.

పూరి జగన్నాథ్


పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్లుగా స‌ని చేసి దర్శకులుగా మారిన వాళ్లలో హరీష్ శంకర్, పరుశురాం, మెహర్ రమేష్‌లు ఇండస్ట్రీకి డైరెక్ట‌ర్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఇక వాళ్లలో హరీష్ శంకర్, పరశురాం సక్సెస్ ఫుల్ దర్శకులుగా కొన‌సాగుతున్నారు. మెహర్ రమేష్ మాత్రం ఫెయిల్యూర్ డైరెక్టర్‌గా మారి ఫేడ్ అవుట్ ఉన్నాడు.

వి.వి.వినాయక్


ఈయన దగ్గర ప‌ని చేసి దర్శకులుగా మారిన వాళ్లలో వశిష్ఠ ఒకడు. ప్రస్తుతం ఈయన మంచి ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే బింబిసారా లాంటి సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈయన.. ఇప్పుడు చిరంజీవితో విశ్వంభర అనే సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. ఇక ఈయన తర్వాత వీడు తేడా అనే సినిమాతో చిన్ని కృష్ణ కూడా దర్శకుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. కాగా చిన్ని కృష్ణ‌ పెద్దగా సక్సెస్ సాధించలేదు. ఇక కందిరీగ మూవీ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ కూడా మొదట వినాయ‌క్‌ దగ్గర దర్శకత్వ శాఖలో వ‌ర్క్‌ చేశాడు. ఇక సంతోష్ డైరెక్ట‌ర్‌గా మొద‌ట ఒకటి రెండు హిట్లు కొట్టిన‌.. తర్వాత మాత్రం సక్సెస్ అందుకోలేకపోయాడు.