“నా 19ఏళ్ల సినీ లైఫ్ లో ‘హీ’ ఈజ్ మోస్ట్ స్పెషల్”.. క్రేజీ మ్యాటర్ బయటపెట్టిన తమన్నా..!!

సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోయిన్స్ ఉన్నారు . కొత్త కొత్త హీరోయిన్స్ పుట్టుకొస్తున్నారు.. కానీ అందాల ముద్దుగుమ్మ తమన్నా మాత్రం ఎప్పటికీ పాతపడిపోవడం లేదు . ఆమె అందాలు ఎవరికి బోర్ కొట్టడం లేదు . ఇండస్ట్రీలోకి వచ్చి 19 ఏళ్లు దాటేసింది . ఇప్పటికీ హీరోయిన్గా సినిమాల్లో నటిస్తుంది అంటే దానికి కారణం ఆమెకున్న అందం అనే చెప్పాలి . ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నంత నాజూకుగా తన స్కీన్ ఉంటుంది.. మిల్కీ బ్యూటీ అంటూ స్టార్ హీరోలు కూడా ఆటపట్టిస్తూ ఉంటారు .

అలాంటి ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోగలిగింది తమన్నా. రీసెంట్గా తమన్న ఓ డైరెక్టర్ పై చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. తమన్నా సాధారణంగా ఎవర్ని పొగడదు. వాళ్ళని పొగిడింది అంటే మాత్రం వాళ్ళు ఆమెకు చాలా చాలా క్లోజ్ అని అర్థం. రీసెంట్గా తమన్నా ఓదల 2 డైరెక్టర్ సంపత్ నంది పై ప్రశంసలు కురిపించింది . గతంలో వీళ్ళ కాంబోలో రచ్చ సినిమా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది .

ప్రెసెంట్ ఓదెల 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు తమన్నా.. సంపత్ నంది . రీసెంట్గా తమన్నా..”నా 19 ఏళ్ల సినీ కెరియర్ లో ఇలాంటి వ్యక్తిని అస్సలు చూడలేదు చిన్న పెద్ద అని చూడరు ..ప్రతి ఒక్కరిని మెచ్చుకుంటాడు ..అప్రిషియేట్ చేస్తాడు.. చాలా నిజాయితీగల డైరెక్టర్” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం తమన్నా.. పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది .సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇప్పుడు తెగ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. తమన్నా ఇంత పొగిడేస్తుంది అంటే ఆమె లైఫ్ లో ఆయన ఎంత స్పెషల్ అంటున్నారు జనాలు . చూద్దాం ఓదెలా 2 ఎలాంటి హిట్ అందుకుంటుందో..?