సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరో, హీరోయిన్లు తాము నటించబోయే సినిమాలో పర్ఫెక్ట్ గా కనిపించడం కోసం శరీరాకృతిని సినిమాకు తగ్గట్లుగా మార్చుకుంటూ.. ఆ క్యారెక్టర్‌కి తగ్గట్టుగా కనిపించడానికి ఎన్నో విధాలుగా కష్టపడుతూ ఉంటారు. అలాంటి వారిలో వరుణ్ తేజ్ ఒకడు. ఇక ఇప్పటికే వరుణ్ తేజ్.. గని సినిమా కోసం తమ లుక్ మార్చుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు. గని మూవీలో వరుణ్ తేజ్ బాక్సర్ రోల్ లో మెప్పించాడు. అయితే తన ఫైట్ సీన్స్ సహజంగా ఉండాలని బాక్సింగ్ నిజంగానే నేర్చుకున్నాడు వరుణ్. కష్టతరమైన ఎక్సైజ్‌లను కూడా చేశాడు. అయితే సినిమా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ ఇవ్వకపోయినా.. వరుణ్ తేజ్ కష్టానికి ప్రేక్షకుల్లో మంచి మార్కులు పడ్డాయి.
ఇక తాజాగా ఆయన నటించిన ఆపరేషన్ వాలంటైన్ సినిమా కోసం మరోసారి తన క్యారెక్టర్ కు తగ్గట్టుగా మేకోవర్ అయ్యాడు. అయితే ఇప్పటివరకు వరుణ్ తేజ్ చేసిన అన్ని ప్రయోగాలు ఒక లెవెల్. ఇప్పుడు చేయబోయే కొత్త ప్రయోగం మరో లెవెల్ అనే టాక్ వినిపిస్తుంది. ఇంతకీ వరుణ్ తేజ్ చేస్తున్న ఆ ప్రయోగం ఏంటి.. ఇంతకీ అది దేనికోసం ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం వరుణ్ తేజ్ మట్కా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కరుణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ మూడు విభిన్నమైన ఏజ్ గ్రూపుల వ్యక్తిగా కనిపించనున్నాడట. 20, 30, 50 ఏళ్ల వ్యక్తిగా మూడు పాత్రలోనూ ఆయన నటించనున్నట్లు సమాచారం. ఈ మూడు పాత్రలో మూడు రకాలుగా ఆయన గెటప్‌లు మార్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా 50 ఏళ్ళ వయసు పాత్రలో వరుణ్ తేజ్ పొట్టతో కనిపించనున్నాడట.
ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ పొట్ట పెంచనున్నాడనే కామెంట్స్ నెటింట వైరల్ గా మారాయి. ఇక కరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నారాఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా టైటిల్, పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇటీవల వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ రిలీజైనా ఆశించిన రేంజ్‌లో సక్సెస్ ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం వరుణ్ తేజ్ మట్కా సినిమా కోసం పొట్ట పెంచుకోబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవ్వడంతో.. రిస్క్ చేస్తున్నవ్ వరుణ్.. ఇప్పటికే సినిమా అవకాశాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. తేడా వస్తే అడుక్కుతినాల్సి వస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.