మ‌ళ్లీ ఆర్ఆర్ఆర్ ర‌చ్చ‌… ఈ సారి అక్క‌డ దుమ్ము లేపిందిగా…!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి రూపొందించి సూపర్ సక్సెస్ సాధించిన సినిమా ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడమే కాదు.. ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగానే కాకుండా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సాధించి రికార్డులు సృష్టించింది. నాటు నాటు పాటకు అయితే ఏకంగా హాలీవుడ్ వేదికగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కిన సంగతి తెలిసిందే.

ఇక ఇటీవల జరిగిన 96వ ఆస్కార్ అవార్డులలో మరోసారి ఆర్‌ఆర్ఆర్ చోటు ద‌క్కించుకుంది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో సోమవారం అకాడమిక్ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ఇందులో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరి లో అవార్డు ప్రకటించే టైంకి నాటునాటు పాట విజువల్స్ ను బ్యాక్ గ్రౌండ్లో ప్లే చేస్తూ మరో పక్కన విజేతలను ప్రకటించారు. హర్యానా గ్రాండ్ ఇండియా.. బార్బీ సినిమాలోని వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ అనే పాటకు గాను వెళ్లి ఎలిష్, ఫినియాస్ ఓకేనాకు పురస్కారం అందింది. ఇక దీనికి సంబంధించి వీడియోను ఆర్‌ఆర్ఆర్ టీం ఎక్స్ ట్విటర్ వేదికగా షేర్ చేసుకున్నారు. ఆస్కార్ గడ్డపై మరోసారి ఆర్‌ఆర్ఆర్ అంటూ క్యాప్షన్ ట్యాగ్ చేసి ఈ పోస్ట్ ని షేర్ చేశారు.

 

అక్కడ నాటు నాటు పాట మాత్రమే కాదు ఆ సినిమాలోని యాక్షన్ స‌నివేశాని కూడా ప్లే చేశారు. జీవితాన్ని రిస్క్ చేసే స్టాంట్‌ మాస్టర్లకు సలాం కొడుతూ గొప్ప స్టాంట్‌ సన్నివేశాల.. వీడియోలు ఆస్కార్ వేదికపై చూపించారు. అందులో హాలీవుడ్ సినిమాలతో పాటు.. నాటు నాటు లోని క్లైమాక్స్ సీన్ కూడా చోటు దక్కించుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ విజువల్స్ వైరల్ కావడంతో అభిమానులంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్‌ఆర్ హవా ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదంటూ.. జక్కన్న సినిమా అంటే ఆ రేంజ్ లో ఉంటుందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.