పవిత్ర నాథ్ మరణించడానికి కారణం ఆ చిన్న తప్పే.. ఫ్యాన్స్ కి కన్నీరు తెప్పిస్తున్న అసలు నిజం..!!

సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదాలు నెలకొంటున్న విషయం మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా అతి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతున్నారు స్టార్ సెలబ్రెటీస్ . రీసెంట్ గా సీరియల్ యాక్టర్ పవిత్ర నాథ్ మృతి అందరికీ బాధాకరం. చక్రవాకం – మొగలిరేకులు లాంటి టాప్ టీవీ సీరియల్స్ లో విశేషంగా ఆకట్టుకున్న పవిత్ర నాథ్ .. మార్చి ఒకటిన్న ఊహించిన విధంగా మరణించారు.

ఈ విషయం ఆయన అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చింది. చాలా చిన్నవయసులోనే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు . కాగా అసలు ఆయనకు ఏం బాగాలేదు..? ఎందుకు ఇంత చిన్న వయసులోనే మరణించాడు..? అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పవిత్ర నాథ్ చాలా యాక్టివ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు .

అయితే ఆయన కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ కారణంగా మందుకు బాగా బానిస అయిపోయాడట. ఆ కారణంగానే పవిత్ర నాధ్ కు ఊపిరితిత్తుల సమస్య మొదలయిందట. దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ వచ్చారట . నాలుగు రోజుల నుంచి ఆ సమస్య ఎక్కువైపోవడంతో ఆయనకి శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందికరంగా అనిపించిందట. ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించండంతో కుటుంబ సభ్యులు దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారట . ఆసుపత్రికి వెళ్లే లోపే పవిత్ర నాథ్ పరిస్థితి విషమంగా మారి మరణించినట్లు వైద్యులు తెలిపారు . హార్ట్ ఫెయిల్ కావడంతోనే ఈ విధంగా జరిగిందట. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు..!!