పబ్లిక్ గా అభిమాని అలాంటి కోరిక తీర్చబోతున్న అనసూయ .. సంచలన నిర్ణయం..!!

అనసూయ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి. న్యూస్ రీడర్గా తన కెరియర్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత జబర్దస్త్ యాంకర్ గా బాగా పాపులారిటీ సంపాదించుకుంది . పలు సినిమాలలో కీలకపాత్రలను పోషిస్తూ తనకంటూ మంచి ఇమేజ్ డిజైన్ చేసుకుంది. కాగా ఈ మధ్యకాలంలో అనసూయ పేరు సోషల్ మీడియాలో ఎలా మారుమ్రోగి పోతుందో మనం చూస్తున్నాం .

రీసెంట్గా అనసూయకు సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతుంది. అనసూయ పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కు హాజరవుతూ సందడి చేస్తుంది . ఈ క్రమంలోనే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వచ్చి తమను హర్ట్ చేస్తున్నావ్ అంటూ ఓ అభిమాని పోస్ట్ పెట్టారు . “ఓపెనింగ్ అంటూ బాగా రెడీ అయి వస్తారు సెల్ఫీలు అది ఇది అంటారు కనీసం మా వైపు కూడా చూడరు”.. అంటూ ఫ్రస్టేషన్తో ఓ పోస్ట్ చేశాడు .

దీనిపై అనసూయ కూడా స్పందించడం గమనార్హం . అనసూయ వీడియో రిలీజ్ చేస్తూ ..”ఎంత మాట అనేసారు .. అదంతా మాకు తెలియకుండానే జరిగిపోతుంది ..తెలిసి తెలిసి అసలు కాదు ఈసారి కచ్చితంగా మనం కలిసి సెల్ఫీ దిగుతాం ..మార్చి 15 నిర్వహించే ఓ కార్యక్రమంలో సెల్ఫీ ఇస్తాను “అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది . ప్రెసెంట్ అనసూయ వీడియో నెట్టింట వైరల్ గా మారింది..!!