ఆహా యాప్ డిలీట్..అల్లు అరవింద్ కి బిగ్ షాక్ ఇచ్చిన గూగుల్ ప్లే స్టోర్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ కు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే.. కాగా అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఓ బడా ప్రొడ్యూసర్ . ఆయన ఆహా అంటూ ఓటిటి సంస్థను కూడా ఇటీవల ప్రారంభించాడు. దీని ద్వారా పలు వెబ్ సిరీస్ లు సినిమాలు కూడా డిజైన్ చేశాడు.

కాగా రీసెంట్గా ఆయనకు కోలుకోలేని షాక్ ఇచ్చింది ప్లేస్టోర్. గూగుల్ ప్లే స్టోర్ నుంచి అల్లు అరవింద్ కు బిగ్ షాక్ తగిలింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆహాను తొలగించారు .తన పాలసీకి విరుద్ధంగా ఉన్న యాప్స్ అన్నిటినీ తొలగించినట్లు సమాచారం . ఇందులో భాగంగానే మెగా ప్రొడ్యూసర్ గా పాపులారిటి సంపాదించుకున్న అల్లు అరవింద్ ఓటిటీ ఆహా పై వేటు పడింది .

అయితే ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో నడుస్తూ ఉండగా ఇలా యాప్స్ తొలగించడం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది . దీనిపై ఆహా వారు కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు . “హాయ్.. ఆహా యాప్ ప్రస్తుతం డౌన్లోడ్ చేసుకోవడానికి గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో లేదు ..ప్రభావం కొత్త ఆప్ డౌన్లోడ్ లకే పరిమితం చేయబడింది” అంటూ చెప్పుకొచ్చింది . ప్రెసెంట్ దీనికి సంబంధించిన వార్త వైరల్ అవుతుంది..!!