హెయిర్ ఫాల్ సమస్యతో బాధిస్తున్నారా.. అయితే ఈ వెజ్ ఆహారాలను తీసుకోండి..?

జుట్టు అనేది ఒక్క ఆడవారికే కాదు మగవారికి కూడా ఎంతో ఇష్టం. కానీ ప్రస్తుతం ఉన్న జనరేషన్లో అనేక సమస్యల కారణంగా జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని అరికట్టేందుకు అనేక బ్యూటీ పార్లర్ మరియు ట్రీట్మెంట్ చేపించుకుంటున్నారు.

చేపించుకున్న కొత్తలో ఏమి కాకపోయినా అనంతరం అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఎదురవుతున్నాయి. మన జుట్టు ఊడడానికి ప్రధాన కారణం సరైన ఆహారం తీసుకోకపోవడమే. మనం కనుక ప్యూర్ వెజ్ ఆహారాలు తీసుకుంటే తప్పనిసరిగా మన జుట్టు ఎదుగుదల ఉంటుంది. మరి ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పాలకూర మరియు ఇతర ఆకుకూరలను తీసుకోవడం ద్వారా మన జుట్టు పెరుగుతుంది. ఇందులో ఉండే ఐరన్ మరియు విటమిన్ ఎ కారణంగా మన బాడీ లో ఉండే గుణాలు మన హెయిర్ కి కూడా అంది మన జుట్టు ఎదుగుదలను పెంచుతుంది.

అదేవిధంగా చిలకడదుంప తినడం కూడా మన జుట్టు సంరక్షణకు తోడవుతుంది. ఇది మన బాడీలో ఉన్న చెడు వ్యాధులను తొలగించి మంచి పోషకాలను అందిస్తుంది. ఇక గింజలు అనగా బాదం మరియు వోల్నట్స్ వంటివి తీసుకోవడం ద్వారా వాటిలో ఉండే పోషకాలు మన హెయిర్ కి అంది పొడవైన మరియు నల్లనైనా జుట్టు మీ సొంతం అవుతుంది. ఇక ఇవే కాకుండా బ్లాక్ బెర్రీస్ తో కూడ మీ జుట్టు ను కాపాడుకోవచ్చు.