ఆ ఊరు బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చరణ్ – బుచ్చిబాబు సినిమా..?

త్రిబుల్ ఆర్ సినిమాతో అలా వచ్చి ఇలా పాపులారిటీ దక్కించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. ఒకప్పుడు అడపా దడపా సినిమాలు చేసిన ఈయన జక్కన్న సినిమా అనంతరం పాన్ ఇండియా సినిమాలకి మాత్రమే సైన్ చేస్తున్నాడు ‌.

ఇక ఇదే క్రమంలో బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా ఓ సినిమాకి సైన్ చేశాడు చరణ్. గతంలో ఈయన తెరకెక్కించిన ఉప్పెన సినిమా ఎంతటి విజయవంతం అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఇక దీనిని దృష్టిలో పెట్టుకుని చెర్రీ బుచ్చిబాబుకి ఛాన్స్ ఇచ్చాడు. మరి ఆ ఛాన్స్ బుచ్చిబాబు నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.

ఇక ఈ మూవీ మొత్తం ఒక గ్రామం బ్యాక్ డ్రాప్ లో కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఉత్తరాంధ్రలోని రామభద్రపురం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందునున్నట్లు తెలుస్తుంది. మైత్రి మూవీస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై చెర్రీ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఎప్పుడు ఎప్పుడు విడుదల చేస్తారా అని ప్రతి ఒక్కరూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.