ఆపరేషన్ వాలెంటైన్ మూవీ రివ్యూ.. వ‌రుణ్ ఖాతాలో హిట్ ప‌డిందా..?

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల హీరోగా నటించిన మూవీ ఆపరేషన్ వాలంటైన్‌. మానుషి చిల్లరా హీరోయిన్‌గా, నవదీప్, మీరు సర్వర్, రోహిణి శర్మ తదితరులు కీలక పాత్రలు నటించారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్లో వ‌చ్చిన‌ ఈ సినిమాటోగ్రాఫర్ గా హరికే వేదంత్ బంయ‌బ‌హ‌రించారు. ఎడిటింగ్ నవీన్ నూని, సంభాషణ సాయి మాధవ్ బుర్ర అందించారు. సోనీ పిక్చర్స్ బ్యానర్ పై సందీప్ ముద్ద ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా నేడు రిలీజ్ అయింది. సినిమా స్టోరీ ఎలా ఉంది.. రేటింగ్ ఏంటో సమీక్షలో చూద్దాం.ఏరియల్ యాక్షన్ జోనర్ సినిమాలు భారతీయ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్నాయి. హృతిక్ రోషన్ కథానాయకుడిగా ఫైటర్ సినిమా ఇటీవలే రిలీజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Operation Valentine

ఆ తర్వాత ఇదే జానర్ లో తెరకెక్కిన మొద‌టి తెలుగు సినిమా ఆపరేషన్ వాలెంటైన్. ఇందులో టాలీవుడ్ మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సినిమాను తెలుగు తో పాటు హిందీలోనూ ఒకేసారి షూటింగ్ పూర్తి చేసుకుని.. రెండు చోట్ల ఒకే రోజున ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు. మరి ఈ సినిమా స్టోరా.. వరుణ్ తేజ్ ఫైటర్ పైలెట్ పాత్రలో ఎలా నటించాడు.. వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా..? ఈ మూవీలో వరుణ్ తేజ్ అరుణ్ రుద్రదేవ్ పాత్రలో వైమానిక దళంలో స్క్వాడ్రన్ లీడర్ ఏం జరిగినా చూసుకుందాం అంటూ ధైర్య సహసాలతో ముందడుగు వేసే వ్యక్తిత్వం. వైమానిక దళంలో పనిచేసే రాడార్ ఆఫీసర్ ఆహనా గిల్‌గా మనిషి చిల్లర న‌టించింది. ఆమెతో వ‌రుణ్ ప్రేమలో ఉంటాడు. ప్రాజెక్ట్ వజ్రా కోసం వరుణ్ రంగంలోకి దిగి పని చేస్తున్న సమయంలో చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.. దాని నుంచి కోలుకునే సమయంలోనే మరోసారి ఆపరేషన్ వాలెంటైన్‌తో రంగంలోకి దిగుతాడు.

Operation Valentine' makes history: First film to launch song 'Vande  Mantaram' at Wagah Border

ఈ ఆపరేషన్ వెనుక ఉన్న కాదేంటి.. ప్రాజెక్ట్ వజ్రా లక్ష్యం ఏంటి.. ఇవన్నీ సినిమాలో చూడాల్సిందే. భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన నిజమైన సంఘటన స్ఫూర్తితో ఈ సినిమా తెర‌కెక్కింది. 2019లో ఉగ్రవాదులు జరిపిన పుల్వామా దాడి నుంచి మొదలై.. భారత వైమానిక దళం జరిపిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ వరకు ఎన్నో సంఘటనలు తెర‌పై అవిష్క‌రించారు. రెండు దేశాల మధ్య పోరాటం.. దేశభక్తి నేపథ్యం అన‌గానే మనకు ఎక్కువగా గుర్తుకు వచ్చేది సైనిక దళాలకు సంబంధించినవే. అయితే దేశాన్ని రక్షించడానికి మూడు దళలు ఎంతో కష్టపడతాయి. అవే సైనిక, నావిక, వైమానికా దళాలు. ఏ దళం చేయవలసిన స‌హ‌సాలు వారికి ఉంటాయి. గనతలంలో కాపలా కాస్తు శత్రువుల నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందే పసిగట్టి పోరాటం చేసే వైమానిక దళం.. అది చూపే సాహ‌సం ఇప్పటివరకు సినిమాల పరంగా వెలుగులోకి రాలేదు. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాతే మన వైమానిక దళల తెగువ‌, క‌ష్టం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమాలు చేయడంపై సినీ పరిశ్రమలు కూడా శ్రద్ధ చూపుతుంది.

Operation Valentine (2024) - IMDb

ఇలా ఫైటర్ జెట్‌ పైలెట్ అయినా వరుణ్ తేజ్ ధైర్య శాహ‌సాలు.. దేశభక్తి నేపథ్యమే ప్రధానంగా సినిమా తెరకెక్కింది. ప్రాజెక్ట్‌ వజ్రతె మొద‌లై ఆ మధ్యలో జరిగిన ఎన్నో ఆపరేషన్స్‌, ఎదురు దాడులు సినిమాల్లో చూపించారు. ఇందులో భాగంగా పోల్వమా దాడి, ఆపరేషన్ వాలెంటైన్, పాకిస్తాన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ నెహ్రూ.. దాని తిప్పికొట్టేందుకు భారత్ ప్లాన్ చేసిన ఆపరేషన్, ఆ ఆపరేషన్స్ సమయంలో జరిగిన సంఘటనలు తెరపై ఆవిష్కరించారు. ఇక‌ సినిమాలో ఎమోషన్స్ తో పాటు గగనతలంలో ఫైటర్ జెట్ల వీర సాహసాలతో కూడిన విజువల్స్ కూడా ఆకట్టుకుంటాయి. పుల్వామా దాడిలో సైనికులు తమ ప్రాణాలను అడ్డుపెట్టి చిన్నారిని కాపాడడం హైలైట్ గా ఉంటుంది. ఇక ఎప్పుడూ వారిస్తూ కనిపించే పై అధికారి ఈ ఘటనతో ఏం జరిగినా చూసుకుందాం అంటూ తెగువ చూప‌డం.. రుద్రా సాహసాలని ప్రోత్సహించడం.. శత్రువుల స్థావరాలను ధ్వంసం చేయడం.. లాంటి సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి.

Operation Valentine Review | FridayWall

హీరో హీరోయిన్ల మధ్య సాగే ప్రేమ కథ అంత‌గా లేదనిపించింది. ఈమధ్య వచ్చిన ఫైటర్ కదా కి చాలా దగ్గరగా పోలిక‌ల‌తో సినిమా ఉండడం కాస్త మైనస్. ఇక వరుణ్ తేజ్ ఫైటర్ పైలెట్గా అదరగొట్టాడు. మనిషి చిల్లర పాత్రకు ప్రాధాన్యత ఉంది. దాదాపు సినిమాలో హీరో, హీరోయిన్లు తెరపై కనిపిస్తూనే ఉంటారు. వీళ్ళ మధ్య ప్రేమ కథలోనే గాఢ‌త‌ లేదు. మిగిలిన పాత్రలన్నీ పరిమితంగానే కనిపించాయి. సాంకేతికంగా సినిమా అద్భుతంగా అనిపించింది. ముఖ్యంగా విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సంగీతం మెప్పించింది. సన్నివేశాలు నాచురల్ గా ఉన్నాయి. ప్రజల పరంగా మరింత ప్రాక్టీస్ ఉంటే బాగుండేది అనిపించింది. నిర్మాణపరంగా ఉన్నతంగా సినిమాలు తెరకెక్కించారు. పరిమితులు ఉన్న నాణ్యమైన విజువల్ సినిమాలు ప్రేక్షకులకు అందించారు. ఇక దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ వైమానిక దళం ఆపరేషన్లు.. వాళ్ళ ధైర్య సాహసాలను కళ్ళకు కట్టినట్లుగా అద్భుతంగా సహజంగా చూపించాడు.