బాలయ్య అంటే చచ్చేంత ఇష్టం ..కానీ ఆ పని మాత్రం చచ్చినా చేయడు ఈ హీరో.. ఎందుకో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా చాలా మంది స్టార్ హీరోలు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు . కానీ కొందరు ఫ్రెండ్షిప్ మాత్రమే బయటపడుతుంది . మరి కొందరు ఫ్రెండ్షిప్ లో లోపలే కంటిన్యూ అవుతుంది. అలాంటి వాళ్ళల్లో ఒకరే వెంకటేష్ – బాలకృష్ణ . టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నరసింహం గా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య ప్రజెంట్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు .

ఈ సినిమా సెట్స్ పై ఉంది . ఎలక్షన్స్ రాబోతూ ఉండడంతో పొలిటికల్ పనుల్లో బిజీగా ఉండడంతో బాలయ్య ఈ సినిమాకి బ్రేక్ చెప్పారు. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అవ్వబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. వెంకటేష్ – సైంధవ్ సినిమాతో భారీ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి కూసింత దూరంగానే ఉన్నాడు .

కాగా వెంకటేష్ మొదటి నుంచి ఇంటర్వ్యూలలో కానీ రియాలిటీ షోస్ లో కానీ తక్కువగా పార్టిసిపేట్ చేస్తారు . ఈ విషయం అందరికీ తెలుసు. బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ షో కి విక్టరీ వెంకటేష్ ని గెస్ట్ గా ఆహ్వానించాలి అని చాలా సార్లు ట్రై చేశారట . కానీ బాలయ్య అంటే ఎంత ఇష్టం ఉన్నా సరే అలాంటి రియాల్టీ షోస్ కి టాక్ షో స్ కి రాను అంటూ తెగ్గేసి చెప్పేసాడట . అప్పట్లో ఈ వార్త బాగా ట్రెండ్ అయింది . బాలయ్య స్వయాన ఫోన్ చేసి అడిగినా కూడా షోకి నేను రాలేను సారీ అంటూ చేతులెత్తేసాడట . దీంతో వెంకటేష్ కి టాక్ షో స్ అంటే ఎందుకు అంత చిరాకు అన్న విషయం అప్పట్లో బాగా ట్రెండ్ అయింది..!!