ఫైనల్లీ.. ఇన్నాళ్లకి పెళ్లి చేసుకోబోతున్న రామ్ పోతినేని.. వైరల్ అవుతున్న అమ్మాయి పిక్స్..!?

ఇండస్ట్రీలో బడా బడా హీరోలు హీరోయిన్లు వరుసగా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. రీసెంట్ గానే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకుంది . అంతేకాదు త్వరలోనే హాట్ హీరోయిన్ పూజా హెగ్డే ..అలాగే ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ తాప్సి కూడా పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . మరి కొంతమంది టాలీవుడ్ యంగ్ హీరోస్ కూడా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. రీసెంట్గా కొంతమందికి నిశ్చితార్ధాలు అయ్యాయి. మరి కొంతమంది నిశ్చితార్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. హీరో వెంకటేష్ కూతురు కూడా ఘనంగా వివాహం చేసుకొనింది.

ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా ఉన్న హీరోలు ఇద్దరు పేర్లు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి . వాళ్లలో ఫస్ట్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇతగాడి పెళ్లి చేసుకుంటాడా ..? లేదా..? అన్నది అందరికీ పెద్ద డౌటే . అయితే రెండవది మాత్రం రామ్ పోతినేని . దేవదాసు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు. ఏం మాయ చేసాడో తెలియదు కానీ రామ్ పోతినేనికి వరుస ప్లాపులు పడుతున్న సరే అమ్మాయిలు ఈయన అంటే పడి చచ్చిపోతున్నారు .

రీసెంట్గా రామ్ పోతినేని పెళ్లికి సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతుంది. గతంలో హీరో రామ్ పోతినేని బుల్లితెర నటి శ్రీ సత్య పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ తెగ ప్రచారం జరిగింది . దానికి కారణం వీరిద్దరూ ఓ షోలో పాల్గొన్న సమయంలో శ్రీ సత్య రామ్ పోతినేనికి ప్రపోజ్ చేయడమే . అప్పట్లో ఈ విషయం ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిందో మనకు తెలిసిందే.

రాం పోతినేని అంటే పడి చచ్చిపోతూ పిచ్చి అంటూ చాలా చాలా హాట్ కామెంట్స్ చేసింది శ్రీ సత్య . రామ్ పోతినేని లాంటి అంత పెద్ద హీరో శ్రీ సత్య ని పెళ్లి చేసుకోవడం అనేది ఖచ్చితంగా జరగని పని . ఇది అందరికీ తెలిసిందే .. కానీ అప్పట్లో సోషల్ మీడియాలో వీళ్ళిద్దరికీ పెళ్లి జరగబోతుంది అంటూ ప్రచారం జరిగింది సీన్ కట్ చేస్తే .. ఆ తర్వాత ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోయారు .

రీసెంట్గా రామ్ పోతినేని పెళ్లి వార్త మరోసారి వైరల్ గా మారింది . వరుసగా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీస్ పెళ్లిళ్లు చేసేసుకుంటున్న మూమెంట్లో కుటుంబ సభ్యుల దగ్గర నుంచి రాం పోతినేనికి కూడా ప్రెజర్ పెరిగిందట . ఈ క్రమంలోనే తన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ నెట్టింట్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి . ఈ వార్త సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది . చూద్దాం మరి ఈ వార్త ఫేక్ కా..? నిజమా తెలియాలి అంటే రామ్ పోతినేని రిప్లై ఇవ్వాల్సిందే..!
!