విజయ్ దేవరకొండ హీరో కాకపోయి ఉండే ఏమై ఉండేవాడో తెలుసా..? నిజంగా రౌడి ఫెలోనే..!!

ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క కోరిక ఉంటుంది . కొన్నిసార్లు ఆ కోరికను తీర్చుకుంటారు .. మరికొన్నిసార్లు ఆ కోరికను తీర్చుకోలేరు . లైఫ్ లో ఆ గోల్స్ ని రీచ్ అవ్వడం చాలా చాలా కష్టం. అయితే చాలా తక్కువ మంది మాత్రమే అలాంటి గోల్స్ రీచ్ అవ్వగలరు. వాళ్లలో ఒకరే మన విజయ్ దేవరకొండ. టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే .

ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . సినిమా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంది చిత్ర బృందం . ఇలాంటి క్రమంలోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తాను ఒకవేళ హీరో కాకపోయి ఉంటే ఏమి అయి ఉండేవాడు అనే విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు . తనకు కెరియర్ లో మూడే మూడు గోల్స్ ఉన్నాయని ..బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకోవడం.. బెస్ట్ హీరోగా అందరి జనాలను మెప్పించడం అని చెప్పుకొచ్చాడు.

ఒకవేళ యాక్టర్ కాకపోయి ఉంటే మాత్రం ఎలక్ట్రికల్ వెహికల్స్ కి సంబంధించిన బిజినెస్ లేదా జాబ్ ఏదైనా చూసుకునే వాడినని చెప్పుకొచ్చాడు. మొదటి నుంచి విజయ్ దేవరకొండకు ఎలక్ట్రికల్ బిజినెస్ అన్న ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్న చాలా చాలా ఇంట్రెస్ట్ అట . ఇదే విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు . కేవలం ఇదే కాదు ఏ విషయమైనా సరే ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తాడు విజయ్ దేవరకొండ. అందుకే అతగాడికి రౌడీ హీరో అంటూ ట్యాగ్ వేశారు అభిమానులు..!!