టాలీవుడ్ బ్యూటీ కేతిక శర్మ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత లక్ష్య, రంగ రంగ వైభవంగా లాంటి సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాలతో ఊహించిన రేంజ్ లో క్రేజ్‌ను అందుకోలేకపోయింది. గత ఏడాది పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంటోలో బ్రో సినిమాలోను ఈ ముద్దుగుమ్మ నటించి మెప్పించింది. కానీ ఈ సినిమాతో కూడా హిట్ అందలేదు. ఆ తర్వాత ఆమెకు మరి ఏ సినిమాలోని ఆఫర్ రాలేదు.
అయితే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలతో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంటుంది. కుర్రకార్రును ఆకట్టుకుంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో కొనసాగుతుంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుంది. తాజాగా కేతిక తన ఇన్‌స్టాగ్రామ్ ఫాన్స్ తో చిట్ చాట్ ప్రోగ్రాం లో పాల్గొని సందడి చేసింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్ ఆమెను వింత ప్రశ్నతో షాక్ అయ్యేలా చేశాడు.
నువ్వు ఆల్‌జీబ్రాలో గుడ్‌యేనా.. ఒకవేళ అదే నిజమైతే నువ్వు ఎందుకు అని అడగకుండా వెంటనే నా ఎక్స్ స్థానంలోకి వచ్చేసేయ్.. లవ్ యు అంటూ కామెంట్ చేశాడు. ఇక అది చూసిన కేతిక శర్మ షాక్ అవుతూ నోరు మూసుకున్న ఫోటో తన ఇన్‌స్టా స్టోరిగా షేర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ నెటింట వైరల్ గా మారాయి. అది చూసిన వారంతా ఆల్‌జీబ్రాలో గుడ్ అయితే వాడి ఎక్స్ పొజిషన్‌లోకి వెళడం ఏంటి.. అసలు వాడు ఏ ఉద్దేశంతో ఆ కామెంట్స్ చేస్తున్నాడో అర్ధం కావట్లేదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.