“ఆ సినిమాకి ఆమె వేస్ట్”.. స్టార్ హీరోయిన్ పై అవసరాల శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్..!

అవసరాల శ్రీనివాసరావు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మల్టీ టాలెంటెడ్ నటుడిగా దర్శకుడిగా ఆయనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు. పలు సినిమాలలో కీలకపాత్రలో నటించి మెప్పించిన అవసరాల శ్రీనివాసరావు.. డైరెక్షన్ విభాగంలో కూడా బాగా మెప్పించాడు . గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవసరాల శ్రీనివాసరావు హీరోయిన్ కీర్తి సురేష్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

మహానటి సినిమాను నాగ్ అశ్వీన్ తెరకెక్కించిన విషయం తెలిసిందే . నాగ్ అశ్వీన్ – అవసరాల శ్రీనివాసరావు మంచి దోస్తులు . మహానటి సినిమా స్టోరీ చెప్పినప్పుడు ఈ పాత్ర కోసం ఏ హీరోయిన్ చూస్ చేసుకుంటాడా..? అంటూ అవసరాల శ్రీనివాసరావు చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేశారట . అయితే ఫైనల్లీ ఆ పాత్ర కోసం కీర్తి సురేష్ ని చూసి చేసుకున్నాడు అని తెలిసినప్పుడు బాధపడిపోయారట .

అసలు ఆమె కమర్షియల్ హీరోయిన్ ..ఇలాంటి పవిత్రమైన మహానటి పాత్రను చేయగలరా ..? అంటూ ఆలోచించారట నాగ్ అశ్వీన్ రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు అనుకున్నారట. కానీ సినిమాకి సంబంధించిన కొన్ని క్లిప్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత నాగ్ అశ్వీన్ డెసిషన్ కరెక్ట్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేసారట . మహానటి కి ఆమె తప్పిస్తే మరీ ఏ హీరోయిన్ సెలెక్ట్ కాలేదు .. న్యాయం చేయలేదు అంటూ అప్పుడే అవసరాల శ్రీనివాసరావు అనుకున్నారట . ఉన్నది ఉన్నట్లు మాట్లాడే అవసరాల శ్రీనివాసరావు మాట్లాడిన మాటలు ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి..!!