కుంకుమ పువ్వుతో అందమైన ముఖ సౌందర్యాన్ని మీ సొంతం చేసుకోండి..?

కుంకుమ పువ్వు పాలల్లో వేసుకుని తాగితే మంచి సౌందర్యంగా కనిపిస్తారు.దీనిని గర్భవతులు ఎక్కువగా పాలల్లో వేసుకుని తాగుతారు.అందాన్ని రెట్టింపు చేయటంలో కుంకుమ పువ్వు సహాయపడుతుంది.చర్మ సౌందర్యానికి వినియోగించే అన్ని రకాల ఉత్పత్తుల్లో కుంకుమ పువ్వుది ప్రధమ స్థానం.ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది.కుంకుమ పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ముఖంపై ఉండే మంగు మచ్చలు, మొటిమలను తగ్గిస్తాయి.

మొటిమల వల్ల వచ్చే మచ్చలను కూడా కుంకుమ పువ్వు తగ్గిస్తుంది.కుంకుమ పువ్వులో ఉండే విటమిన్ ఎ, బీ కొల్లాజెన్ సంశ్లేషణలో సహాయపడుతాయి.ఇది చర్మ స్థితిస్థాపకతను కాపాడుతుంది.కుంకుమపువ్వు వినియోగిస్తే ముడతలు రావు.కుంకుమ పువ్వులో పొటాషియం, మినరల్స్,విటమిన్ ఎ, బి, సీలు అధికంగా ఉంటాయి.ఇది ముడతలు, ఫైనలైన్స్ ఏర్పడకుండా కాపాడుతాయి.కుంకుమపువ్వు తాలూకా నాలుగు రేఖలను పచ్చి పాలల్లో నాలుగు గంటల పాటు నానబెట్టాలి.

ఈ విషమాన్ని కటన్ తో ముఖం, మెడకు రాస్తే చర్మం మెరుస్తుంది.కొన్ని తులసి ఆకులని తీసుకుని బాగా బ్లెండ్ చేయాలి. ఇందులో కొద్దిగా నీరు, కుంకుమ పువ్వు కలిపి ముఖానికి రాయాలి. దీంతో చర్మం మెరుస్తుంది.రెండు టేబుల్ స్పూన్ల తేనెలో కుంకుమ పువ్వు పొడిని కలపాలి.ఈ పిస్టమాన్ని చర్మానికి రాసి, 15 నిమిషాల తర్వాత వాష్ చెయ్యటంలో మొటిమలు తగ్గుతాయి.