60 నిమిషాల్లో 60 వేల ఫోన్ల విక్రయం.. ఈ ఫోన్ ఎందుకు అంత స్పెషల్ అంటే..?

ప్రస్తుత నథింగ్ ఫోన్ 2A హవా నడుస్తుంది. భారత్ మార్కెట్లోకి ఈనెల 5న రిలీజ్ అయిన ఈ కొత్త మోడల్.. మార్చ్ 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్కార్ట్, క్రోమా, విజయ్ సేల్స్ ద్వారా నెటింట‌ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సేవ్ పై మొబైల్ సంస్థ కీలక ప్రకటన వెల్లడించింది. సేల్ ప్రారంభమైనా 60 నిమిషాల్లో 60 వేల స్మార్ట్ ఫోన్లు విక్రయం జరిగినట్లు సంస్థ వెల్లడించింది. వినియోగదారుల నుంచి వచ్చిన స్పందనకు నథింగ్ సంస్థ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎక్స్ లో పోస్ట్ ను షేర్ చేసుకుంది. అయితే నథింగ్ సంస్థ బడ్జెట్ రేంజ్ ఫోను అందుబాటులోకి తీసుకురావడం మొదటిసారి.

గత మోడల్ మాదిరిగా ట్రాన్స్ఫ ర్ంట్‌ డిజైన్ ను కలిగి ఉన్న ఈ ఫోన్ ఎన్నో ఫీచర్లతో రిలీజ్ అయింది. ఇది భారతదేశంలో మూడు డిఫరెంట్ వేరియేషన్స్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది. వాటిలో మొదటిది 8gb ర్యామ్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌ఉన్న రూ.23,999 మొబైల్. 8gb ర్యామ్, 256gb ఇంటర్నల్ స్టోరేజ్ తో రూ.25, 999 ఫోన్. 12gb ర్యామ్‌, 256 జిబి స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ఇది రూ.27,999. ఇలా ఈ మూడు వెరియంట్స్‌ బ్లాక్ అండ్ వైట్ కలర్‌ల‌లో అందుబాటులో ఉన్నాయి.

నథింగ్ ఫోన్2A ను హెచ్డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసిన వారికి వెంటనే 2000 రూపాయల డిస్కౌంట్ వచ్చేటట్టు ఆఫ‌ర్ ప్రకటించింది. అలాగే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా కూడా మొబైల్ కొనుగోలు చేయడం వల్ల ధరలో కాస్త డిస్కౌంట్ లభిస్తుంది. దీంతోపాటే ఎక్స్చేంజ్ చేసుకోవడంతో రెండు వేల రూపాయల తగ్గింపు పొందవచ్చట. ఫలితంగా బేస్ వేరియంటర్ ధర రూ.19, 999గా ఉండబోతోంది. 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎమ్ఐ సదుపాయం అందుబాటులో ఉండడంతో.. ఈ ఫోన్ కొనుగోలు చేసేందుకు కూడా జనం ఆసక్తి చూపుతున్నారు.