బాలయ్యతో షూటింగ్ ప్రారంభించిన ప్రశాంత్ వర్మ.. పోస్ట్ వైరల్..!

నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన టాలీవుడ్ లోనే మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.ఇక తాజాగా భగవంత్ కేసరి సినిమాతో మంచి విజయాన్ని సంపాదించుకున్నాడు.నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబి తో తన కెరియర్ 109వ సినిమా చేస్తున్న సంగతి తెలిసింది.

మరి ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకున్నాయి. అయితే ఈ లైనప్ లో యంగ్ అండ్ టాలెండెడ్ దర్శకుడు ” హనుమాన్” తో పాన్ ఇండియా సెన్సేషన్ గా మారిన ప్రశాంత్ వర్మతో సినిమా కూడా ఉందని చెప్పారు.అలాగే మీరు కాంబినేషన్లో వచ్చిన బాలయ్య ఓటిటి షో ” అన్ స్టాపబుల్” సీజన్స్ కూడా పెద్ద హిట్ అయ్యాయి.

అయితే ఇప్పుడు ఈ యంగ్ దర్శకుడు చేసిన లేడెస్ట్ పోస్ట్ మంచి క్రేజీగా మారింది.మళ్లీ తన హ్యాపి ప్లేస్ లోకి వచ్చాను, బాబు రెడీ బాబు ” అంటూ పోస్ట్ చేశాడు. అయితే దీనితో మళ్ళీ బాలయ్యతో అన్ స్టాప్ప బుల్ సెట్స్ లోకి కానీ వచ్చారా లేక మళ్లీ ” జై హనుమాన్” షూట్ లో జాయిన్ అయ్యాడా అనేది ఆసక్తిగా మారింది. ఇక‌ దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.