డార్లింగ్ ” రాజా సాబ్ ” నుంచి అప్డేట్ వచ్చేసిందోచ్.. ఇక బాక్స్ ఆఫీసులు మోత మోగాల్సిందే..?

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.ఈయన టాలీవుడ్ లోనే మంచి పేరు సంపాదించుకున్నారు. దాదాపు 5 ఏళ్ల తర్వాత’ సలార్’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ఆయన ఖాతాలో ఒకటి రెండు కాదు ఎన్నో భారీ సినిమాలు ఉన్నాయి.అందులో ‘కల్కి 2898 AD’ ఈ ఏడాది విడుదల కానుంది.

అలాగే ‘ సలార్ 2′ , స్పిరిట్’ రాజా సాబ్, సినిమాలు కూడా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కానున్నాయి.ఇక ఈ మూడు చిత్రాలను ఇప్పటికే ప్రకటించగా ‘ కల్కి 2898 AD’ షూటింగ్ ను పూర్తి చేసిన తర్వాత.డార్లింగ్ సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ చేస్తున్న’ స్పిరిట్’ షూటింగ్ లో జాయిన్ అవ్వతున్నారని ఇటీవలే ప్రకటించారు.అయితే ఇందులోనే ప్రభాస్ మూడవ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది.

అది ఏమిటంటే ‘సలా 2’ లేదా ‘స్పిరిట్’ సినిమాలు కాకుండా ప్రభాస్ ‘ది రాజా సాబ్’ మూవీ షూట్ లో జాయిన్ అవబోతున్నట్లు తెలిపారు.ఇక ఈ సినిమాని తెలుగు, తమిళం, కన్నడ,మలయాళం, హిందీ భాషల్లో జనవరి 15న ఈ సినిమాను రిలీజ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారంట మేకర్స్.దీనితో ఈ జాన్ లేదా జూలైలో ప్రభాస్ ‘ ది రాజా సాబ్’ షూటింగ్ ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ మూవీ షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి చేసే 2025 సంక్రాంతి కానుకగా భారీగా విడుదల కానుంది.