రాగిజావని దూరం పెడుతున్నారా… అయితే ఈ బెనిఫిట్స్ కోల్పోయినట్లే..?

రాగి జావా సమ్మర్ లో ఎక్కువగా తాగుతారు. ఇది షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా ఎక్కువగా తాగవచ్చు. ఇది ఆరోగ్యానికి మంచి హెల్దీ జావా గా చెప్పొచ్చు.రాగిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ప్రతిరోజు ఉదయమునే రాగి జావా తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

రాగి లో ప్రోటీన్, కార్బ్ హైడ్రేట్లా శరీరానికి తగిన శక్తిని అందిస్తుంది.ఉదయమనే రాగి జావా తాగటం వల్ల రోజంతా ఉత్సాహం గా ఉంటుంది.రాగి జావాలో ఫైబర్ అధికం. ఇది జీర్ణ క్రియను మెరుగుపరచటంలో సహాయపడుతుంది.మలబద్ధకం, అతిసార, కడుపు ఉబ్బరం వంటి’ సమస్యలను తగ్గిస్తుంది.రాగిలో విటమిన్లు, ఖనిజాలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

వ్యాధులను నివారించడంలో ,శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.బరువు తగ్గటానికి సహాయపడుతుంది. రక్తపోటును ని మంత్రించడంలో, కోలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. రాగి లో పాలీఫెనాల్స్ అధికం.ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. మీరు కూడా దీన్ని తప్పకుండా తాగండి.