అయ్యబాబోయ్.. మన దేవిశ్రీప్రసాద్ ఏంటి ఇలా మారిపోయాడు.. లేటెస్ట్ పిక్స్ చూస్తే కడుపు రగిలిపోతుంది..!

దేవిశ్రీప్రసాద్.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీని తన మ్యూజిక్తో ఉర్రూతలూగించిన డైరెక్టర్ గతంలో దేవిశ్రీప్రసాద్ ఖాతాలో ఎలాంటి హిట్స్ పడ్డాయో కూడా మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా మాస్ సాంగ్స్ చేస్తే మంచంలో ఉన్న ముసలివాడు సైతం లేసి ఆడాల్సిందే . అలాంటి ఓ స్పెషల్ మ్యూజిక్ ని అందిస్తూ వచ్చాడు. ఆనందం -కలుసుకోవాలని – ఖడ్గం – మన్మధుడు – సొంతం – వెంకీ – ఆర్య – బన్నీ – భద్ర – నువ్వు వస్తానంటే నేనొద్దంటానా .. లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించి మెస్మరైజ్ చేశాడు దేవి శ్రీ ప్రసాద్ .

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా ను ఓ రేంజ్ లో ఊపేసాడు . ఈ సినిమాకి అవార్డు కూడా అందుకున్నాడు . రీసెంట్గా దేవిశ్రీప్రసాద్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తయింది . ఈ సందర్భంగా ఆయనకు తండేల్ టీం బెస్ట్ విషెస్ అందించింది. దేవిశ్రీప్రసాద్ సిల్వర్ జూబ్లీ వేడుక పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మ్యూజికల్ మ్యాస్ట్రో ఇళయరాజా ను గురువుగా భావించే దేవిశ్రీప్రసాద్ ఆయనతో ఉన్న ఫోటోను స్టూడియోలో పెట్టుకొని ఆరాధిస్తూ ఉంటాడు.

రీసెంట్గా ఇళయరాజాను ఆయన కలిసిన పిక్చర్స్ షేర్ చేసుకున్నాడు . ఈ క్రమంలోనే దేవిశ్రీప్రసాద్ లుక్స్ వైరల్ గా మారాయి. దేవి లుక్స్ చాలా చాలా మారిపోయాయి . చాలా సన్నగా అయిపోయాడు . అసలు గుర్తుపట్టలేకపోతున్నాము . అయితే దేవిశ్రీప్రసాద్ కి ఏదైనా జబ్బుందా ..? అన్న కోణంలో ప్రచారం జరుగుతుంది . మరికొందరు ఆయన కావాలనే బరువు తగ్గాడు అని కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి దేవి శ్రీ ప్రసాద్ లుక్స్ ఇప్పుడు హాట్ టాపిక్ వైరల్ అవుతున్నాయ్..!