అజిత్ కు తల నిండా తెల్ల జుట్టు ఉండడానికి కారణం అదేనా..? బయటపడ్డ షాకింగ్ నిజం..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి వార్తను రాద్ధాంతం చేయడం భూతద్దంలో పెట్టి చూడడం ఎక్కువగా చేస్తున్నారు జనాలు. రీసెంట్గా సోషల్ మీడియాలో కోలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో అజిత్ .. జుట్టు తెల్లగా ఉండడం పై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి . ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో అజిత్ 100 కోట్ల హీరోగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆయన నటించిన సినిమాలు ఫ్లాప్ అయినా సరే కలెక్షన్స్ పరంగా కుమ్మేస్తూ ఉంటాయి.

రీజన్ ఏంటో తెలియదు . అజిత్ సినిమాలు ఎంత భిన్న విభిన్నంగా ఉంటాయో.. మనకు తెలిసిందే. రీసెంట్ గానే అజిత్ ఓ సర్జరీ చేయించుకున్నాడు. దానికి సంబంధించిన వార్తలు కూడా బాగా ట్రెండ్ అయ్యాయి . కాగా అజిత్ కి హెల్త్ ప్రాబ్లం ఉందని ఆ కారణంగానే ఆయన హెల్త్ జుట్టు మొత్తం తెల్ల రంగులో ఉంటుంది అన్న వార్త ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . తమిళ వివాదాస్పద నటుడు బైల్వన్.. అజిత్ కు కంటి సమస్య ఉన్నట్లు సంచలన విషయాన్ని బయటపెట్టారు .

కంటి జబ్బుకు సంబంధించి చికిత్స కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు . ఎంతోమందికి అజిత్ చాలా సహాయం చేశాడు అన్న విషయాన్ని కూడా బయటపెట్టారు . అంతేకాదు అజిత్ కి 8 ఆపరేషన్లు జరిగాయి అన్న విషయాన్ని కూడా బయట పెట్టాడు . అందుకే ఆయన డాన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడట. ఆయనకి తెల్ల జుట్టు రావడానికి ఆయన వాడే మెడిసిన్సే కారణమంటూ కూడా చెప్పుకొచ్చాడు బైలవాన్. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఆయన వ్యాఖ్యలు మాత్రం కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి..!!