పాన్ ఇండియా లెవెల్ లో ఇప్పటి వరకు ఎవ్వరు బ్రేక్ చేయలేకపోయినా ప్రభాస్ రేర్ రికార్డ్..?!

స్టార్ హీరో ప్రభాస్‌కు పాన్‌ ఇండియా లెవెల్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్న.. ప్రభాస్ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాదు హీరోల అందరిలోనూ తాను ప్రత్యేకమైన వ్యక్తిగా త‌ను క్రియేట్ చేసిన‌ రికార్డులతో ప్రూవ్ చేసుకున్నాడు. రేర్ కాంబినేషన్‌తో మొద‌లుకొన్ని రికార్డ్ స్థాయి బాక్స్ ఆఫీస్ నెంబర్, భారీ పాన్ ఇండియా మూవీ లైన్ అఫ్ ఇలా అన్ని విషయల‌లోను అంద‌రు స్టార్ హీరోల‌కు భారీ కాంపిటీషన్ ఇస్తూ. రేసులో దూసుకుపోతున్నాడు. అందుకే ప్రభాస్ క్రేజ్‌ టాలీవుడ్‌ను దాటి భారత్ స్థాయికి ఎదిగింది.

ప్రస్తుతం దేశంలో అసలు సిసలు పాన్ ఇండియన్ స్టార్ ఎవరు అంటే ప్రభాస్ పేరే మారుమోగిపోతుంది. ఇప్పుడు ప్రభాస్ మరోసారి పాన్ ఇండియా లెవెల్‌లో త‌నకు మించిన హీరో లేరు అనే విషయాన్ని ప్రూవ్ చేసాడు. ఈ క్రేజ్ తాజాగా ఎక్స్ ట్విట‌ర్‌ టాప్ హ్యాష్ ట్యాగ్స్‌ ఆఫ్ ఇండియా లిస్ట్ లోను కనిపించింది. ఎక్స్ టాప్ హ్యాష్ ట్యాగ్స్‌ ఆఫ్ భారత్ లిస్టులో పేరు సంపాదించుకున్న ఏకైక హీరోగా ప్రభాస్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంటర్టైన్మెంట్ విభాగంలో టాప్ టెన్ మోస్ట్ యూజ్డ్ హాస్ టాగ్స్ లిస్టులో మ‌న ప్రభాస్ మాత్రమే చోటు సంపాదించుకున్నాడు.

Nag Ashwin clarifies Kalki 2898 AD won't be a franchise like Star Wars - Hindustan Times

ట్విట్టర్ భారత్ ఈ లిస్టును తాజాగా రిలీజ్ చేయగా ఇది ప్రభాస్ స్టార్‌డంకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఇక సోషల్ మీడియాలో కనిపించిన రిఫ్లెక్షన్ అయినా కావచ్చు.. మరేదైనా కావచ్చు.. ప్రభాస్ సాధించిన ఈ రికార్డ్‌తో ప్రస్తుతం ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అభిమానులు సంతోషాన్ని రెట్టింపు చేసేందుకు ప్ర‌భాస్ కల్కి 2898 ఏడి, రాజాసాబ్‌, స్పిరిట్‌తో పాటు హ‌నురాగపుడి కాంబో మూవీతో వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ముందుకు వ‌చ్చేందుకు సిద్ధం అయ్యాడు.