బాలకృష్ణ – బోయపాటి మూవీకి ముహూర్తం ఫిక్స్.. అఖండ 2 కాదా.. ఇదేం ట్విస్ట్ రా బాబు..?!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ.. ప్రస్తుతం తన 109వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాబీ డైరెక్షన్లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. ఎన్‌బికె 109 రన్నింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం సరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో.. భారీ క్యాస్టింగ్ చోటు దక్కించుకుంది. బాబీ డియాలతో పాటు దుల్కర్ సల్మాన్, షైన్ టామ్‌ చాకో, గౌతం మీనన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో బాలకృష్ణ నటించబోతున్న నెక్స్ట్ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెల‌కొంది. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలయ్య తన నెక్స్ట్ సినిమాను చేయబోతున్న సంగతి తెలిసిందే.

Akhanda (2021) - IMDb

అఖండ టైంలోనే వీరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుంది అంటూ వివరించారు. అయితే అఖండ 2 రాబోతుందని చెప్పుకొచ్చిన ఈ కాంబో ఇప్పుడు ఈ సినిమా విషయంలో సడన్ ట్విస్ట్ ఇచ్చింది. ఇక బోయపాటి తాజాగా గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాకు హీరో ఎవరనే విషయాన్ని మాత్రం వివరించలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ గీతా ఆర్ట్స్.. అల్లు అరవింద్ బ్యానర్ పై బోయపాటి తెరకెక్కిస్తున్న సినిమాలో బాలయ్య హీరో అని తెలుస్తోంది. అయితే వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమా అఖండ 2 నా.. కాదా.. అనేదానిపై మాత్రం క్లారిటీ లేదు. దీనికి కారణం అఖండ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాలో భాగం కాకపోవడమే.

Boyapati Sreenu & Allu Aravind joined forces

అలాంటి క్రమంలో ఆయన ప్రమేయం లేకుండా సీక్వెల్ తీయడం కుదరదు. మరి ఇప్పుడు బాలయ్యతో చేసే మూవీ ఏమైఉంటుంది అనేదానిపై సందేహాలు మొదలయ్యాయి. అదే టైంలో ప్రేక్షకులకు ఇది పెద్ద ట్విస్ట్‌లా మారింది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉండగా.. తాజాగా మరొ క్రేజి అప్డేట్ వైరల్ అవుతుంది. ఈ మూవీ ప్రారంభించడానికి ముహూర్తం ఫిక్స్ చేశారని.. ఏప్రిల్ 9న బాలయ్య బోయపాటి మూవీ కంబో ప్రారంభం కానుందని తెలుస్తోంది. థ‌మన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కాస్టింగ్ వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇక ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న ఎన్‌బికే 109ను జూన్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. లేదంటే దసరా బరిలో దించే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగాయి.