ఆ విషయంలో ఎన్టీఆర్ అలా.. పవన్ కళ్యాణ్ ఇలా .. వీళ్ళని ఇక జన్మలో మార్చలేము రా బాబు..!!

కొందరు చాలా మూర్ఖత్వంగా ఉంటారు . తాము నమ్మిన సిద్ధాంతాన్ని ఎలా అయినా సరే దాన్ని ఫాలో అవ్వాలి అనుకుంటూ ఉంటారు . తమను ముంచేస్తున్నా సరే వాళ్ళని దగ్గర పెట్టుకొని ఉంటారు . ప్రెసెంట్ అలాంటి ఇద్దరు హీరోల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . వాళ్లు మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ – పవన్ కళ్యాణ్ . ఇద్దరు కూడా ఇండస్ట్రీలో తోపైన స్టేటస్ కలిగిన హీరోలు .

ఈ పేర్లు చెప్తే ఇండస్ట్రీలో ఎలాంటి అరుపులు కేకలు వినపడతాయో కూడా మనకి బాగా తెలుసు. అలాంటి ఇద్దరు హీరోలు పై ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది . మనకు తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ కి కోపం ఎక్కువ ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు . పవన్ కళ్యాణ్ కూడా అంతే.. చాలా క్లియర్ గా ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తాడు . ఇది చేస్తాను అంటే చేస్తాడు ఇది నేను చేయలేను అంటే చేయడు . అలాంటి మనస్తత్వం కలవాడు పవన్ కళ్యాణ్.

అయితే ఎన్టీఆర్ – పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఓ విషయంలో పెద్ద తప్పు చేస్తున్నారు అంటున్నారు అభిమానులు. తమను ముంచేస్తున్నారు తమను చీట్ చేస్తున్నారు అని తెలిసిన వాళ్లని ఇంకా నమ్ముతూ పక్కనే పెట్టుకొని ఉంచుకోవడం చాలా చాలా పెద్ద తప్పు అంటూ సజెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. గతంలో ఎన్టీఆర్ పక్కనే జాన్ జిగిడి దోస్తుగా ఉన్న పొలిటికల్ లీడర్ ఆయనకు ఎలా హ్యాండ్ ఇచ్చాడు మనకి తెలిసిందే . ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే తప్పు చేస్తున్నాడు . పవన్ కళ్యాణ్ ని పొలిటికల్ లీడర్ ముంచేస్తున్నాడు . ఈ విషయం తెలిసిన కూడా పవన్ కళ్యాణ్ చూసి చూడనట్టు వదిలేస్తున్నాడు . దీంతో జనసైనికులు పవన్ కళ్యాణ్ ని అలర్ట్ చేసే పనిలో పడ్డారు . కొందరు మాత్రం వీళ్లు ఇక మారరు .. వీళ్ళని ముంచేస్తున్నా సరే వాళ్ళని నమ్ముతారు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు..!!