మెగా ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. చరణ్ సినిమాలో అది మాత్రం ఉండదు.. బుచ్చి బాబు కొంప ముంచేశాడు రోయ్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ రీసెంట్ గానే గేమ్ చేంజర్ అనే సినిమా షూట్ ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకోరావడానికి పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకున్న బుచ్చిబాబు సనా దశకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటించబోతుంది అంటూ అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్.. రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు సైతం ఘనంగా పూర్తి చేసుకున్నారు . ఈ సినిమాలో రామ్ చరణ్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నట్లు ఓ న్యుస్ వైరల్ అవుతుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ లీకై వైరల్ గా మారింది . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ అనే వాడే ఉండడట.

సినిమా మొత్తం చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ముందుకు వెళుతుందట . హీరో గోలే హీరోకి విలన్ గా మారే ఒక క్రేజీ కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కబోతుందట. ఈ సినిమాలో కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ కూడా ఒక పాత్ర చేస్తున్నాడు . అందరూ ఈయన ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నాడు అని అనుకున్నారు. కానీ అటువంటిది ఏదీ లేదు అంటూ పూజా కార్యక్రమాలలో క్లారిటీ ఇచ్చాడు . దీంతో మెగా ఫాన్స్ కి బిగ్ షాక్ తగిలింది . సినిమాలో విలన్ లేకుండా కథను ముందుకి ఎలా తీసుకెళ్లగలడు..? బుచ్చిబాబు సనా పెద్ద రిస్కే చేస్తున్నాడు అంటూ భయపడిపోతున్నారు..!!