పరగడుపున పసుపు నీళ్లు తాగడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉంటాయా.. ముఖ్యంగా మహిళలలో..

పసుపు సాధారణంగా యాంటీబయాటిక్‌గా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు.. గాయాలు నయం చేయడానికి కూడా తోడ్పడతాయి. ఇక భారత దేశంలో ప్రతి వంటింటిలోనూ తప్పక మసాలా దినుసులలో పసుపు కూడా ఉంటుంది. ఇది వంటకు రంగుతో పాటు రుచిని, ఆరోగ్యన్ని కలిగిస్తుంది. పసుపును సూపర్ ఫుడ్ గా తీసుకుంటూ ఉంటారు. క్యాన్సర్ తో పోరాడి డిప్రెషన్ను తగ్గించడానికి పసుపు సహకరిస్తుంది. ఇందులో ఉండే సమ్మేళనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక ప్రతిరోజు ఉదయాన్నే పసుపు నీటిని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.

ఆడవారిలో మరీ ప్రయోజన కారిగా ఇది పనిచేస్తుంది. తరచూ జలుబు, దగ్గు లాంటి సమస్యలు ఇబ్బంది పడేవారు.. పసుపు నీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఫిట్గా ఎనర్జిటిక్ గా ఉండగలుగుతారు. పసుపు అనేది విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అలాంటి పోషకాలను సమృద్ధిగా అందించే సూపర్ ఫుడ్. శ‌క్తితో నిండిన ఈ ఆహారం రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని కాపాడుతుంది. శీతాకాలంలో టర్మరిక్ డ్రింక్ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఇంత‌కీ ఈ టర్మరిక్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలంటే.. ముందుగా నీటిని మరిగించి అందులో పసుపు, సోంపు, అల్లం ముక్క వేసి ఐదు నుంచి ఏడు నిమిషాలు మంట తగ్గించి మరిగించాలి.

కాస్త చల్లారిన తర్వాత దానిలో నిమ్మరసం, తేనే కలుపుకుని తాగాలి. గోరువెచ్చగా కావాలంటే వేడిగా ఉన్నప్పుడే తీసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఈ వేడి పసుపు నీళ్ళు తాగడం వల్ల ఫీట్ గా ఉండొచ్చు. కాలుష్యం కారణంగా రోగ నిరోధక శక్తి బలహీనపడుతుంది. ఇలాంటి సమయంలో చిన్నచిన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా మనల్ని ఎంతో ఇబ్బంది పెడతాయి. పసుపుతో తయారు చేసిన వేడి పానీయాలు దానికి ఎంతో అద్భుతమైన ప్రయోజన కారిగా పనిచేస్తాయి. పసుపు మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇందులో కార్కమిన్, జింక్, విటమిన్ సి సమృద్ధిగా లభిస్తాయి. ఆడవారిలో ఇది రుతుక్రమ సమస్యలకు కూడా చెక్ పెడుతుంది.