మ‌గ‌వారి కంటే ఆడవారిలో మైగ్రేన్ ఎక్కువగా రావడానికి కారణం ఏంటో తెలుసా..?

ప్రస్తుత లైఫ్ స్టైల్ లో మైగ్రేన్ అనేది చాలా సాధారణంగా తలెత్తుతున్న సమస్య. ఈ సమస్య పురుషులకంటే ఎక్కువగా మహిళల్లోనే ఎక్కువ‌గా ఉంటుంది. మైగ్రేన్ నొప్పి కనీసం నాలుగు గంటల వరకు తీవ్రంగా బాధిస్తుంది. వికారం లేదా వాంతులు కూడా ద‌దీని ల‌క్ష‌ణాలు. ఇక ఎటువంటి శబ్దాలు విన్నా కూడా అసౌకర్యంగా, చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. మైగ్రేన్ నొప్పి మూడు రోజుల వరకు నిరంతరాయంగా ఉంటుంది. నొప్పి మొదట ఒక వైపు నుంచి మొదలై.. శరీరంలో ఇతర భాగాలకు వ్యాపించి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇది చెవిలో రింగింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది.

 

మన దేశంలో 15% మందికిపైగా ఈ మైగ్రేన్ సమస్య ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ప్రధాన కారణం హార్మోన్ల అసమతుల్యత అని తెలుస్తుంది. పురుషులకంటే మహిళలు ఎక్కువగా హార్మోన్ మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇక ఈ సమస్యకు ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రధాన కారకం. ఈస్ట్రోజన్ హార్మోన్ కారణంగా మైగ్రేన్ సమస్య మొదలవుతుంది. చాలామంది స్త్రీలు పీరియడ్ సమస్యల కారణంగా రెగ్యులర్ హార్మోన్ మందులను వేసుకుంటారు. అంతేకాకుండా గర్భినిరోధక మాత్రలు కూడా మింగుతూ ఉంటారు. వీరిలో మైగ్రేన్ సమస్యలు ఎక్కువగా వ్యాప్తిస్తాయి. మైగ్రేన్ సమస్యలు 18 నుంచి 49 సంవత్సరాల వయసు గల వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.

కోవిడ్ తర్వాత ఈ సమస్య మరింత పెరిగింది. మైగ్రేన్ లో డిప్రెషన్ మానసిక అస్థిరత సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ సమస్యకు డాక్టర్లను సంప్రదించాలి మైగ్రేన్ నొప్పి వచ్చినప్పుడు కొన్ని సాధారణ లక్షణాలు మనం గమనించవచ్చు. ఎండలోకి వెళ్ళినప్పుడు తలనొప్పి ఆకలి వేసినప్పుడు తలనొప్పి.. సరిగా నిద్ర లేకపోయినా తలనొప్పి వస్తూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మంచిది. అలాగే మైగ్రేన్ తో బాధపడేవారు చాక్లెట్లు అసలు తీసుకోకూడదట. ప్రస్తుతం చాలా మంది మైగ్రేన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మరి ముఖ్యంగా మహిళలు ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు. హార్మోన్లు అసంతుల్యత కారణంగా ఒత్తిడి కారణంగా మైగ్రేన్ వ్యాపిస్తుంది. మైగ్రేన్ నొప్పి విపరీతంగా ఉంటుంది కనుక వెంటనే సంప్రదించాలి.