వార్నీ.. మన ప్రభాస్ ఆ హీరోలతో మల్టీ స్టారర్ మూవీ చేయకపోవడానికి కారణం ఇదా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టార్లర్ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా బడాబడా స్టార్ హీరోలు కూడా కలిసి వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో అలాంటివి ఎన్నో చూసాం. రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది . ప్రభాస్ బాలీవుడ్ హీరోలతో మల్టీస్టారర్ మూవీ లో నటించకుండా ఉండడానికి కారణం ఇదే అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

మనకు తెలిసిందే ప్రభాస్ అందరితో మింగిల్ అవ్వలేడు .. చాలా రిజర్వ్ గా ఉంటాదు. ఆయన మింగిల్ అయితే మాత్రం జాన్ జిగిడి దోస్త్ అయిపోతాడు . అయితే బాలీవుడ్ హీరోలు చాలామంది ఆయనను తొక్కేయడానికి ట్రై చేస్తున్నారు అన్న వార్తలు వినిపించాయి . ఈ విషయం ప్రభాస్ కి కూడా బాగా తెలుసు అట . అందుకే బాలీవుడ్ హీరోలతో ఎక్కువ మింగిల్ అవ్వకుండా ఆయన పని ఆయన చూసుకొని పోతున్నాడట.

బడాబడా హీరోలు మల్టీ స్టారర్లర్ల విషయాన్నీ తన ముందు తీసుకొచ్చిన సైలెంట్ గా నవ్వుతూ ఎస్కేప్ అయిపోతున్నాడట. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు ఉన్నంత నిజాయితీగా బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు ఉండరు అనేది ప్రభాస్ అభిప్రాయం. అందుకే బాలీవుడ్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి ఇష్టం చూపించట్లేదు. ప్రజెంట్ ప్రభాస్ కల్కి సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఆ తర్వాత మారుతీ దర్శకత్వంలో తెరకెక్కే “రాజ్ సాబ్” సెకండ్ షెడ్యూల్లో పాల్గొనబోతున్నాడు. ఆ తర్వాత సలార్ 2 ని సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు..!!