ఆ విషయం లో చిరంజీవి నే నెం 1.. ఆయనను మించిన హీరో మరొకరు లేరు..రారు..!

మెగాస్టార్ చిరంజీవి .. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . టాలీవుడ్ ఇండస్ట్రీ అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు. చిరంజీవి నటనలోనూ టాలెంట్ లోను ఈయనకి ఎవరు సాటిరారు అని చెప్పాలి . ఈ వయసులోనూ హీరోగా జనాలను ఎంటర్టైన్ చేస్తున్నాడు.. అంటే ఆయనలోని స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు . సినిమా ఇండస్ట్రీలోకి ఎంతమంది స్టార్ హీరోలు అయినా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు . కానీ జనాల మనసుల్లో మాత్రం కొందరే నిలిచిపోతారు.

అలాంటి హీరోలలో ఒకరే ఈ చిరంజీవి . మనం వచ్చాం ..మనం సుఖపడడం ..మనం డబ్బులు సంపాదించుకున్నాం.. ఇక మనకెందుకులే అనుకోకుండా నలుగురు ఇండస్ట్రీలోకి వచ్చి తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వడానికి చాలా చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు చిరంజీవి . మిగతా హీరోలు అలా కాదు తమ పని తాము అని చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. చిరంజీవి మాత్రం ఇండస్ట్రీకి పెద్దదిక్కుల అన్ని చూసుకుంటూ ఉంటాడు .

గతంలో సినిమా టికెట్ రేటు విషయంలోనూ.. సినిమా ఇండస్ట్రీలో జరిగే అవకతవక విషయాలలోనూ చిరంజీవి పెద్ద నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. చిరంజీవి వయసుతోపాటు ఉన్న హీరోలు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. వేలకోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు కానీ ఎప్పుడూ ఏ హీరో కూడా లీడ్ తీసుకోరు. ఇండస్ట్రీలో ఏదైనా సమస్య అంటే మాత్రం దూరంగా వెళ్లిపోతారు . అయితే అలాంటి వాళ్ళకి చిరంజీవి ఎప్పుడూ భయపడడు. ఆయనకు తోచిన సహాయం ఆయన చేస్తూ ఉంటాడు. ఆ విషయంలో చిరంజీవి నెంబర్ వన్ ఇంకొక చిరంజీవి ఇండస్ట్రీలోకి రాడు.. రాలేరు అంటూ మెగా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు..!!