“ఎంత తోపు అయిన హీరో అలా అడిగిన నేను చేయను”.. ఇన్నాళ్లకు శ్రీలీల కి బుద్దొచ్చిందా..?

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ చాలా చాలా బోళ్ద్ డెసిషన్స్ తీసుకుంటున్నారు . మరీ ముఖ్యంగా స్టార్ హీరో ..పాన్ ఇండియా హీరో విషయాలలో కూడా ఏం మాత్రం తగ్గడం లేదు . రీసెంట్గా అదే లిస్టులోకి వచ్చింది అందాల ముద్దుగుమ్మ శ్రీలీల. పేరుకు కన్నడ బ్యూటీనే.. అయినా తెలుగులో మంచిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న ఈ కన్నడ సోయగం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్ గా మారిపోయింది .

రీసెంట్గా ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద తుస్సు మన్నాయి . ఈ క్రమంలోనే ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ వేయించుకుంది . అయితే శ్రీలీల బ్యాడ్ టైం లో క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు కొందరు డైరెక్టర్లు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఆమె డాన్స్ లో తోపు .. ఇరగదీసేస్తుంది .. ఎలాంటి స్టెప్స్ అయినా సరే అవలీలగా వేసిస్తుంది.. అలాంటి శ్రీలీల తో ఐటమ్ సాంగ్ చేయిస్తే ఇంకేమన్నా ఉందా ..?

Actress Sree Leela Pictures @ Dhamaka Movie Press Meet

సిల్వర్ స్క్రీన్ షేక్ అయిపోవాల్సిందే . అందుకే శ్రీ లీల చేత ఐటెం సాంగ్స్ చేయించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట మేకర్స్ . కానీ శ్రీ లీల మాత్రం చచ్చిన ఐటమ్ సాంగ్ చేయను అంటూ తెగేసి చెప్పేస్తుందట . అది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా..? ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చినా..? చేయను అంటూ చెప్పేస్తుందట. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటికైనా నీకు బుద్ధొచ్చిందా..? అంటున్నారు అభిమానులు..!!