బుట్ట బొమ్మలా మెరిసిన జాన్వీ కపూర్.. అచ్చం మీ అమ్మలానే ఉన్నావ్ అంటూ..

బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వి కపూర్ ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగు సినిమాల్లో సత్తా చాటుకోవడానికి సిద్ధమయ్యింది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాలో తారక్ సరసన తంగం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఆమె పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పోస్టర్‌లో ఆమె అచ్చ తెలుగు అమ్మాయిల లంగా ఓణిలో డీగ్లామరస్ లుక్‌లో మెరిసి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన కాకముందే.. ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ 16వ‌ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.

Janhvi Kapoor In Sridevi Silk Saree,मां श्रीदेवी की यह सिल्क की साड़ी, जाह्नवी कपूर के दिल के है बेहद करीब - janhvi kapoor shares her throwback pic in mom sridevi silk saree

బుచ్చిబాబు సనా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో రానున్న ఈ సినిమాకు జాన్వి హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఇటీవల జాన్వి పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేక‌ర్స్‌. అలాగే ఈ ముద్దుగుమ్మకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తున్నాయంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. బన్నీ సినిమాలో స్పెషల్ సాంగ్ ఈమె సెలెక్ట్ అయిందని.. కోలీవుడ్ స్టార్ సూర్య హిందీ మూవీ కర్ణా లోను జాన్వీకి ఆఫర్ వచ్చిందంటూ తెలుస్తుంది.

ఈ విషయాన్ని తండ్రి భోనీ కపూర్ స్వయంగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఓ పక్కన చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న జాన్వి.. రెండు చేతుల సంపాదిస్తూనే.. మరో పక్క కమర్షియల్ యాడ్ చేస్తూ భారీ రెమ్యునరేషన్ అందుకుంటుంది. ఇక సోషల్ మీడియాలోను తన గ్లామరస్ ఫోటోలతో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తుంది. ఇటీవల చీర కట్టులో బుట్ట బొమ్మల మెరిసింది జాన్వి. ఈ ఫోటోల‌లో అచ్చ తెలుగు అడ‌ప‌డుచు.. అందాల బుట్ట‌బొమ్మ‌లా ఎంతో అందంగామెరిపింది. అతిలోకసుందరిలా కనిపించడంతో.. తల్లి శ్రీదేవిని గుర్తు చేసావ్ అమ్మడు.. అచ్చం నీ అమ్మలానే ఉన్నావ్ జాన్వీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.