శర్వానంద్ కోసం బాలయ్య రొమాంటిక్ టైటిల్.. హిట్ కొట్టేశావ్ పో రా హీరో..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్న శర్వానంద్ .. నందమూరి బాలయ్య కు ఎంత పెద్ద ఫ్యాన్ అన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా తన సినిమాలలో కొన్నిసార్లు ఆ విషయాన్ని పరోక్షంగానే బయట పెట్టేస్తూ ఉంటాడు . శర్వానంద్ గత కొంతకాలంగా హిట్లు లేక అల్లాడిపోతున్నాడు. హీరో శర్వానంద్ ప్రజెంట్ రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకొచ్చాడు .

రెండు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ జోనర్ సినిమాలు కావడం గమనార్హం. కాగా ఇదే క్రమంలో శర్వానంద్ తన నెక్స్ట్ సినిమా విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ వైరల్ గా మారింది . ప్రెసెంట్ శర్వానంద్ – అబ్బ రాజు దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ సినిమా టైటిల్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు బాలయ్య హిట్ బ్లాక్ బస్టర్ మూవీ టైటిల్ పెట్టుకొచ్చారట . బాలయ్య కెరియర్ లో ఎన్ని సినిమాలు ఉన్నా సరే ఫాన్స్ కి మోస్ట్ ఫేవరెట్ గా నిలిచే మూవీ మాత్రం “నారి నారి నడుమ మురారి” అని చెప్పాలి. ఈ సినిమా ఎన్నిసార్లు చూసిన తనివి తీరదు . ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుంది . ఈ సినిమా టైటిల్ ని ఇప్పుడు శర్వానంద్ తన నెక్స్ట్ సినిమాకి పెట్టుకున్నారట .దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ ను ట్రెండ్ చేస్తున్నారు . చూద్దాం మరి ఈ సినిమాతో శర్వానంద్ ఎలాంటి హిట్ అందుకుంటాడు..??