విజయ్ దేవరకొండ .. వామ్మో ఈ హీరో గురించి ఎంత చెప్పకున్నా తక్కువే. మరి ముఖ్యంగా ఈ హీరోకి జెంట్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మాట్లాడటం పక్కన పెడితే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి . స్కూల్ కి వెళ్లే చిన్న పాప దగ్గర్నుంచి పెళ్లి అయిపోయి.. ఇద్దరు పిల్లలు ఉన్న ఆంటీ వరకు విజయ్ దేవరకొండను బాగా లైక్ చేస్తూ ఉంటారు .
ఆయన సినిమాలను బాగా ఇష్టపడుతూ ఉంటారు . అలాంటి ఒక క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ . తాజాగా ఆయన నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్ . మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది . రీసెంట్గా తిరుపతిలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. స్టేజ్ పైకి వచ్చిన నిర్మాత దిల్ రాజు విజయ్ దేవరకొండ ను ఓ రేంజ్ లో పొగిడేసారు.
అంతేకాదు పక్కనే నిల్చోని విజయ్ దేవరకొండ బుగ్గ గిల్లుతూ..” విజయ్ కి అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలుసు.. కానీ ఈ సినిమా తర్వాత అది మరింత పెరిగిపోతుంది ఈ సినిమాలో విజయ్ ని అందరూ బాగా ఇష్టపడతారు ..ఇదే విషయం మా ఆవిడ కూడా నాకు చెప్పింది ..అంత మంచి రోల్ ఈ సినిమాలో విజయ్ చేశాడు “అంటూ బుగ్గ గిల్లుతాడు. అంతే ఒక్కసారిగా అక్కడ ఉండే అమ్మాయిలు ఓ రేంజ్ లు అరుపులు కేకలతో గ్రౌండ్ దద్దరిల్లిపోయేలా అరుస్తారు. ఎంతలా అంటే ఒక స్టార్ , పాన్ ఇండియా హీరోకి జెంట్స్ కూడా ఆ రేంజ్ లో అరవరు..ఆ విధంగా అమ్మాయిలు విజయ్ దేవరకొండ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు . ప్రజెంట్ దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి..!!