స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసేది అప్పటి నుంచే.. సందీప్ రెడ్డివంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తే దూసుకుపోతున్న డార్లింగ్.. ఆయన నటిస్తున్న అన్ని సినిమాలను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో రాజా సాబ్, స్పిరిట్, సలార్ 2, కల్కి సినిమాలు క్యూ లో ఉన్నాయి. కాగా గతేడాది సలార్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలచిన సంగతి తెలిసిందే. అలాగే సందీప్ రెడ్డివంగా చివరిగా తెరకెక్కించిన యానిమల్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంది.

ఇక గతంలోను ప్రభాస్, సందీప్ రెడ్డివంగా కాంబోలో స్పిరిట్ మూవీ తెరకెక్కుతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇది ఓ పోలీస్ ఆఫీసర్ స్టోరీ అని.. యాక్షన్ సీన్స్ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటాయని సందీప్ రెడ్డివంగా వివరించాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వార్క్‌ జరుగుతుందని చెప్పుకొచ్చాడు. తాజాగా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Sandeep Reddy Vanga – I want to direct Shah Rukh Khan | Latest Telugu  cinema news | Movie reviews | OTT Updates, OTT

సందీప్ మాట్లాడుతూ ప్రస్తుతం స్పిరిట్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. ఏడాది చివర్లో అంటే డిసెంబర్‌లో షూటింగ్ స్టార్ట్ అవుతుందంటూ వివరించాడు. ప్రస్తుతం సందీప్ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ గా మారడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభాస్ త్వ‌ర‌లో కల్కి 2898ఏడితో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ఈ సినిమా షూట్ పూర్తయింది. త్వరలోనే రాజా సాబ్ షూటింగ్ మొదలుపెట్టి.. దసరాలోపు దీనిని పూర్తి చేస్తాడట డార్లింగ్. ఆ వెంటనే డిసెంబర్‌లో స్పిరిట్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట.