పెరుగు ఎక్కువగా తింటున్నారా?… అయితే డేంజర్ జోన్ లో పడినట్లే..?

సాధారణంగా కొందరు పెరుగును ఎక్కువగా ఇష్టంగా తింటూ ఉంటారు. మరికొందరు మాత్రం అస్సలు దగ్గరికి రానివ్వరు. పెరుగుని తినని వారు కంటే తినేవారీ ఎకువ‌ సంఖ్యలో ఉంటారు. పెరుగుని అధికంగా తింటే అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. వేసవికాలం వచ్చిందంటే చాలు ఎంతోమంది పెరుగుని ఇష్టంగా తింటూ ఉంటారు.

ఇందులో పోషకాలు మరియు అనేక విటమిన్లు దాగి ఉంటాయి. అయితే పెరుగు తినడం కొందరికి ప్లస్ అయితే మరికొందరికి మాత్రం మైనస్ అవుతుంది. ముఖ్యంగా ఆస్తమా రోగాలు ఉన్నవారు పెరుగు తినడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. పెరుగు శీతలీకరణ ప్రభావత్వాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఆస్తమాతో బాధపడేవారు పెరుగుని ఎక్కువగా తినవద్దు. అదేవిధంగా పెరుగు తిన్న తరువాత చాలామందికి కడుపు ఉబ్బరం మరియు గ్యాస్ కూడా వస్తూ ఉంటాయి.

గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవారు పెరుగును ఎక్కువగా తినక పోవడమే మంచిది. పెరుగు ని తోడు వేసి కనీసం ఫైవ్ అవర్స్ వరకు ఉంచుతారు. ఆ టైంలో పాలలో ఉన్న విటమిన్స్ లో కొన్ని విటమిన్స్ గ్యాస్ కింద మారుతాయి. తద్వారా పెరుగును తినడం ద్వారా గ్యాస్ ఫామ్ అవుతుంది. త్రీ ఫోర్ అవర్స్ లో తోడువేసిన పెరుగును తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం దరిచేరదు. ఈ విషయాన్ని స్వయంగా నిపుణులే తెలియజేస్తున్నారు. అందువల్ల పెరుగును ఎక్కువగా తినకండి. సమతూలంలో తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని రక్షించుకోండి.