పెళ్లి తరువాత ఫస్ట్ టైం భర్త తో అలాంటి పని చేసిన రకుల్.. అమ్మడు మంచి మూడ్ లో ఉన్నట్లు ఉందే..!

రకుల్ ప్రీత్ సింగ్ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకుంది. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ అభిమానులను బాగా ఆకట్టుకునింది రకుల్ ప్రీత్ సింగ్ . తాజాగా పెళ్లి చేసుకుంది . తన ప్రియుడు నిర్మాత జాకిభగ్నాని ను ప్రేమించి పెళ్లి చేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్.

వీళ్ళ పెళ్లి గోవాలో ఘనంగా అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య జరిగింది . వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి . పెళ్లి తర్వాత పెద్దగా కనిపించని రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ టైం తన భర్త జాకీ భగ్నాని తో కలిసి ఇన్స్టా లో ఓ రీల్ చేసింది . ప్రజెంట్ ఈ రిల్ టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. బ్లాక్ అవుట్ ఫిట్ లో రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నాని ఓ రేంజ్ లో రెచ్చిపోయి కుమ్మిపడేశారు .

దీనికి సంబంధించిన వీడియోని బాగా ట్రెండ్ చేస్తున్నారు రకుల్ అభిమానులు . ఇద్దరి జంట చూడ చక్కగా ఉంది అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. పెళ్లి తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలకు దూరం కాబోతుంది అంటూ ఓ ప్రచారం జరిగింది. అయితే అదంతా ఫేక్ అని పెళ్లి తర్వాత కూడా రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలో నటిస్తుంది అని .. అంతేకాదు బోల్డ్ క్యారెక్టర్స్ లో కూడా నటించడానికి ఆమె సిద్ధంగానే ఉంది అంటూ ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)