వాట్.. మహేష్ బాబు జుట్టు ఒరిజినల్ కాదా.. విగ్గా.. అసలు సీక్రెట్ రివీల్ చేసిన మేకప్ మ్యాన్..

సినీ ఇండస్ట్రీలో త‌మ అభిమాన హీరో, హీరోయిన్లు, నటి, నటుల లైఫ్ స్టైల్ పై, పర్సనల్ విషయాలపై ప్రేక్షకులు ఆసక్తి చూపుతూ ఉంటారు. ప్రతి ఒక్కరిలోనూ తమ ఫేవరెట్ సెలబ్రిటీ గురించి పర్సనల్ విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. అందులో భాగంగానే వారి రోజువారి లైఫ్ స్టైల్, వారి లగ్జరీ హౌస్‌లు, కార్లు వారి ధరించే బట్టలు ఇలా ప్రతి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో వినిపించ‌గానే దానిని క్షణాల్లో వైరల్ చేస్తూ ఉంటారు. అలాంటి విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూప్తు ఉంటారు. అలా కొంతమంది స్టార్ హీరోల హెయిర్ స్టైల్ చూస్తుంటే ఇది నిజమైన జుట్ట.. లేదా.. విగ్గా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతుంటాయి.

ఈ అనుమానానికి ప్రముఖ సూపర్ స్టార్ కృష్ణ.. మ్యాకప్ మ్యాన్ గా పనిచేసిన మాధవరావు తాజాగా క్లారిటీ ఇచ్చాడు. గతంలో అనారోగ్య సమస్యలు మరణించిన సూపర్ స్టార్ కృష్ణ కు బ్యూటీ మ్యాన్ గా పనిచేసిన ఆయన.. ఇప్పటికే ఎన్నో యూట్యూబ్ ఛానళ్ళ‌కు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇందులో మ్యాకప్ మ్యాన్ మాట్లాడుతూ.. కృష్ణ గతంలో నటించిన సినిమాల్లో ఒరిజినల్ జుట్టా.. లేకపోతే విగ్గ్తో యాక్ట్ చేసేవారా అనే ప్రశ్న ఎదురు అయింది. దానికి ఆయన సమాధానం చెబుతూ ఇంతకుముందు కృష్ణ ఒరిజినల్ జుట్టుతోనే సినిమాలు చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు అది పల్చబడడంతో విగ్ వాడారని వివరించాడు. అదే టైంలో మహేష్ బాబు కూడా విగ్గ్‌ ఉపయోగిస్తాడా అనే ప్రశ్న వస్తే.. ఎప్పటినుంచో మహేష్ బాబు కూడా విగ్గు వినియోగించేవారు.. అయిన విగ్గ్‌ లేకుండా ఉండేవారు కాదు.

Photo Moment: Mahesh Babu leaves fans speechless with a new pic |  123telugu.com

ఆయనకు కూడా చాలా ప‌లసటి జుట్టు ఉండడంతో విగ్గ్‌ ఉపయోగించాల్సి వచ్చింది అంటూ వివరించాడు. మొదట మహేష్ బాబు కొన్ని సినిమాల్లో ఒరిజినల్ హెయిర్ లోనే కనిపించినా.. రాను రాను ఆయన జుట్టు మరింతగా ఊడిపోవడంతో ఆయన తరచూ విగ్గ్‌ వాడేవారని ప్రతి నెల విగ్గ్‌ వాడడం కాస్త కష్టం అనిపించడంతో.. హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కూడా చేయించుకున్నాడు అంటూ వివరించాడు. న్యూ టెక్నాలజీని ఉపయోగించి హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ తో కూడిన క్యూ6 హెయిర్ ప్ల‌స్ టెక్నాలజీని వాడారని తెలుస్తోంది. ఇక అప్పటి నుంచి మహేష్ తల మీద జుట్టు మొలసిందట. ఈ హెయిర్ సర్జికల్ ఫిక్సింగ్ సిస్టం మొత్తం ఓ సెట్ట‌ప్ అని సమాచారం. ఈ సిస్టం మహేష్ బాబే కాదు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి ఎంతోమంది స్టార్ హీరోలు చేయించుకున్నారని టాక్.