రామ్ చరణ్ ” గేమ్ చేంజర్ ” మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయిన చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాపై మెగా అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా అంజలి మరియు సూర్య తదితరులు కీలకపాత్రలు వహిస్తున్నారు. ఈ సినిమాని ఏడాదిలో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. కానీ రిలీజ్ కి సంబంధించిన ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు.

ఇక రామ్ చరణ్ పుట్టినరోజు నాడు 27న ఈ సినిమా టీజర్ రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఆ రోజున సినిమా రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు మరియు శిరీష్ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందించాడు. ఇక ఈ సినిమా అప్డేట్స్ గురించి చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఆ వారి ఆవేదనను అర్థం చేసుకొని ఏమైనా అప్డేట్ ఇస్తారో లేదో చూడాలి మరి.