సోషల్ మీడియాను వణికిస్తున్న సమంత సిస్టర్ పిక్స్.. కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్..!

టాలీవుడ్ హీరోయిన్స్ లో ఒకరైన సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన ఈ ముద్దుగుమ్మ మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ ఒక సంవత్సర కాలం పాటు ఇండస్ట్రీకి దూరమైన సంగతి తెలిసిందే.

ఇక సమంత ఇండస్ట్రీకి ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ ఇంకా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. సమంత చివరిగా ఖుషి సినిమాలో నటించింది. ఇక సమంత సినీ కెరీర్ గురించి పక్కన పెడితే..తాజాగా సమంతకు చెల్లెలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఏ మాత్రం తూచా తప్పకుండా సమంత తన పెళ్లిలో ఎలా అయితే రెడీ అయిందో ఆమె చెల్లి కూడా అలానే రెడీ అయ్యి దర్శనమిచ్చింది. పెళ్లి కూతురు గెటప్ లో సమంత పోలికలతో దర్శనం ఇవ్వడంతో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సమంతకి ఇంత పెద్ద చెల్లి ఉందా? మేము ఎప్పుడు చూడలేదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.