ఆ విషయంలో మాకు మేమే సాటి.. బన్నీ సంచలన వ్యాఖ్యలు..!

పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయిన అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమాలో బన్నీ చెప్పిన తగ్గేదేలే డైలాగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే.

ఇక తాను నటించిన పుష్ప సినిమా మంచి పాపులర్ అవడంతో పుష్ప 2 ని కూడ‌ నిర్వహించారు చిత్ర బృందం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ సర్వేగంగా జరుగుతుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బన్నీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే యాంకర్..రైజ్ అయిపోయింది ఇప్పుడు రూలా? అని ప్రశ్నించగా..” ఇది కేవలం పుష్ప గాడి రైజ్ కాదు పుష్ప గాడి రూల్ కాదు ఇండియన్స్ రూల్.

త్వరలోనే చరిత్ర తిరగరాస్తాం ” అంటూ సమాధానం ఇచ్చాడు బన్నీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మాకు మేమే సాటి.. అల్లు అర్జున్కి మరెవ్వరు సాటి రాలేరు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆయన అభిమానులు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.