‘ జమల్కుడు ‘ ట్రెండింగ్ స్టెప్ లకు చిందులేసిన అల్లు అర్హ.. ఎంత క్యూట్ గా చేసిందంటే.. (వీడియో)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అల్లు అర్హ అయితే ఇప్పటికే మిడిల్ రేంజ్ హీరోయిన్లకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేస్తుంది. అర్హ చిలిపి చేష్టలను, వీడియోలను సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్, స్నేహ రెడ్డి దంపతులు ఎప్పుడు ఫాన్స్ తో షేర్ చేస్తూనే ఉంటారు. దీంతో స్టార్ కిడ్‌గా క్రేజ్‌ను సంపాదించుకున్న అర్హ.. తాజాగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యానిమల్ సినిమాల్లో సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న‌ జమ్మల్కుడు సాంగ్ కి క్యూట్ క్యూట్ గా స్టెప్పులు వేసి అదరగొట్టింది.

తనదైన స్టైల్ లో ఈ పాటకు డాన్స్ రి క్రియేట్ చేసింది. ఒరిజినల్ గా బాబి డియోల్ తలపై గ్లాస్‌ పెట్టుకొని డాన్స్ చేస్తే.. అల్లు అర్జున్ గారాలపట్టి అర్హా మాత్రం తలపై ప్లేట్ పెట్టుకొని చిందులేసింది. ఇప్పుడు ఈ డ్యాన్స్ కు సంబంధించిన వీడియో నెట్టెంటా తెగ వైరల్ గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్‌ చేసిన కొద్దిసేపట్లోనే లైక్స్, కామెంట్స్ తో నెట్టింట‌ తెగ వైరల్ అవుతుంది. క్యూట్ డ్యాన్స్ అర్హ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక గతంలో అల్లు అర్హ.. సమంత నటించిన శకుంతలంలో భరతుడి పాత్రలో కనిపించింది.

Allu Ayaan 😍 Allu Arha (@ayaan_arha_official_) • Instagram photos and  videos

ఈ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర లో కూడా అల్లు అర్హ నటించబోతుందంటూ వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఇందులో హీరోయిన్ గా జాన్వి కపూర్ నటిస్తుంది. జాన్వీ కపూర్ చిన్నప్పటి రోల్‌లో అర్హ కనిపించబోతుందట. అయితే దీనిపై బన్నీ ఫ్యామిలీ కానీ, దేవర టీం కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజై రికార్డులు క్రియేట్ చేయడంతో పుష్ప 2 పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెల‌కొన్నాయి.