కాస్టింగ్ కౌచ్ పై ప్రముఖ నటి సెన్సేషనల్ కామెంట్స్.. అవకాశాల కోసం లొంగిపోతున్నారంటూ..

‘ డాలర్ డ్రీమ్స్ ‘ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది సత్య కృష్ణన్‌. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదట హోటల్ తాజ్ కృష్ణ లో జాబ్ చేసిన ఈమె ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనే ఆనంద్ సినిమాలో ఓ కీ రోల్‌లో నటించింది. ఈ సినిమాతో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నంది అవార్డును గెలుచుకున్న సత్యా కృష్ణ.. ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతుంది. మెంటల్ కృష్ణ, ఒక్కడినే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, చొమ్మ‌రిల్లు ఇలా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది.

Satya Krishnan: నటి సత్యకృష్ణన్‌ కూతురునూ చూశారా? అమ్మను మించిన అందంతో..  త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ

ఈమె తాజాగా నాగచైతన్య హీరోగా తెరకెక్కిన దూత వెబ్ సిరీస్ లోను కీలకపాత్రలో నటించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సందడి చేసిన సత్య కృష్ణన్ మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్ పై ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. కాస్టింగ్ కోచ్ ఎక్కడైనా ఉంది. అది ఎదురైనప్పుడు ఆడవాళ్లు తమని తాము ప్రోటెక్ట్ చేసుకోగలిగితే అంతా సక్రమంగా జరుగుతుంది అంటూ సత్య కృష్ణ వివరించింది. ఎదుటివారు లిమిట్ క్రాస్ చేస్తుంటే.. మనం ధైర్యంగా సమాధానం చెప్పాలి అంటూ చెప్పుకోచ్చిన ఈమె.. కమిట్మెంట్ కు ఒప్పుకోకపోతే ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వరేమో అన్న భయంతోనే చాలామంది లొంగిపోతారు.

South Actress Satya Krishnan Biography and Career - Tfipost.com

అయితే ఆ ఉద్దేశం తప్పు. నా వరకు నా కెరీర్ లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి నాకు ఎదురు కాలేదు. కాని అలాంటి పరిస్థితి ఎదుర్కొన్న వారిని ప్రత్యక్షంగానే చూసా అంటూ వివరించింది. సినిమాలు తప్ప వేరే లైఫ్ లేదని ఇండస్ట్రీలోకి వచ్చేవారు.. క్యాస్టింగ్ కౌచ్ ఎదురుకోవడం కష్టంగానే ఉంటుంది అయినా కాస్త ధైర్యంతో అలాంటి టైం లోనే వారిని వారు ప్రొటెక్ట్ చేసుకోవాలి.. అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇటీవల కాలంలో నటిగానే కాకుండా సత్య కృష్ణన్‌ నిర్మాతగా కూడా అడుగులు వేస్తుంది. తాజాగా ఆమెకు డైరెక్షన్ పై కూడా ఆసక్తి ఉందంటూ వివరించింది. అయితే కాస్టింగ్ కౌచ్ పై ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.