చిరు ‘ విశ్వంభర ‘ లో ఎంట్రీ ఇవ్వనున్న ఇద్దరు క్రేజీ బ్యూటీస్.. అసలు గెస్ చేయలేరు..

మెగాస్టార్ చిరంజీవి చివ‌ర‌గా భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచనాల నడుమ రిలీజైన‌ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వ‌ద్ద చిరు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఇక ఈ మూవీ తర్వాత చిరంజీవి క‌థ‌ల ఎంపిక విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్ర‌మంలో మల్లాడి వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక కొద్ది రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ కూడా మొద‌లైంది. చిరు 156 వ మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ పై ప్రేక్ష‌కుల‌లో మంచి అంచ‌నాలు ఉన్నాయి.

Is Trisha's Film With Chiranjeevi Put On Hold? | Telugu News, Times Now

ఇక కొంత‌కాలం క్రితం ఈ సినిమాకు మేక‌ర్స్ విశ్వంభర టైటిల్ ను ఫిక్స్ చేసి అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. ఇక ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ సినియ‌ర్ బ్యూటి త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈ సినిమా యూవి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవికి ఐదుగురు అక్క చెల్లెలు ఉంటారని.. వారందరిదీ కూడా కీలకపాత్రలుగా ఉంటాయని తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ సినిమాల్లో నా సామిరంగా బ్యూటీ ఆషికా రంగానాథన్.. చిరంజీవి సోదరిగా నటిస్తున్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి.

Vishwambhara : మెగాస్టార్ 'విశ్వంభర'లో.. ఆ ఇద్దరు హీరోయిన్స్ కూడా..? పదేళ్ల  తర్వాత తెలుగులో రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..? | Actress surabhi and esha  chawla will play ...

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం వైరల్ అవుతుంది. ఇందులో మరో ఇద్దరు స్టార్ బ్యూటీస్ ఇషా చావ్లా, సురభి కూడా నటిస్తున్నారట. వీరిది కూడా కీలకపాత్ర అంటూ తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రెండు షెడ్యూల్ పూర్తయ్యాయి. మొదటి స్కెడ్యూలను చిరంజీవి, త్రిష లేకుండా మేకర్స్ మాత్రమే రూపొందించారు. సెకండ్స్ షెడ్యూల్లో చిరు, త్రిషపై కొన్ని ఆసక్తి సన్నివేశాలు షూట్ చేయబడ్డాయి. ఇకపోతే ఈ నెల 26న కొత్త స్కెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ఈ మూడో షెడ్యూల్లో చిరంజీవి, త్రిష తో పాటు యంగ్ క్రేజీ బ్యూటీ ఇషా చావ్లా, సురభిలు కూడా నటించబోతున్నారట. ఈ స్కెడ్యూల్‌లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు దాదాపు పూర్తి చేస్తారని తెలుస్తుంది.