అల్లు శిరీష్ కెరీర్ పై ఫోకస్ పెట్టిన బన్నీ.. ఏం చేస్తున్నాడంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పాటుచేసుకున్నాడు. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియాలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ప్రస్తుతం ఈ సినిమా సీక్వల్ గా తెర‌కెక్కనున్న పుష్ప 2లో నటిస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు బన్నీ. ఈ సినిమా ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే తాజాగా అల్లు అర్జున్ కు సంబంధించిన ఆసక్తికరమైన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Pushpa: The Rule - Part 2 (2024) - Photo Gallery - IMDb

అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ హీరోగా ఇండస్ట్రీ లోకి ఇప్పటికే ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే శిరీష్ ఇప్పటివరకు ఎన్ని సినిమాలలో నటించిన సరైన సక్సెస్ అందకపోవడంతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో బన్నీ.. త‌న‌ తమ్ముడు కెరీర్ పై దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కొంతమంది స్టార్ డైరెక్టర్ల‌తో బ‌న్ని.. శిరీష్ సినిమాలు తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నాడట.

Allu Arjun birthday: Allu Sirish shares unseen childhood pics of the Pushpa actor; wishes his brother with an adorable note

అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఏదిగినా తమ్ముడు పై ప‌లు ట్రోలింగ్స్ ఎదురు కావడంతో బన్నీ.. శిరీష్ సినీ కెరీర్‌పై కాన్సెంట్రేట్ చేసినట్లు.. అతని కెరీర్ ఎలాగైనా సక్సెస్ చేసేందుకు కొంతమంది తమిళ్ డైరెక్టర్ లతో అల్లు శిరీష్ సినిమాలు చేసే విధంగా మాస్టర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్ రంగంలోకి దిగిన తర్వాత అయినా శిరీష్ సినీ కెరీర్ సక్సెస్ అందుతుందో లేదో చూడాలి.