అల్లు వారి కోడలు ఆ విషయంలో కెవ్వు కేక.. బన్నీనే మడత పెట్టేసే టైప్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ కు ఇండస్ట్రీలో ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయన నటిస్తున్న పుష్ప 2 సినిమాకి సంబంధించిన పోస్టర్స్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి . కొన్ని ఫొటోస్ లీక్ అయి వైరల్ గా కూడా మారాయి . ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు జనాలు . కాగా సోషల్ మీడియాలో బన్నీ ఎంత యాక్టివ్ గా ఉంటాడో అంతకు డబల్ రేంజ్ లో ఆక్టివ్ గా ఉంటుంది స్నేహ రెడ్డి .

అల్లు వారి ఇంటి కోడలుగా బాగా పాపులారిటీ దక్కించుకుంది. ఫిట్నెస్ లో హీరోయిన్స్ కి మించి పోయే రేంజ్ లో కాన్సన్ట్రేషన్ చేస్తూ వచ్చే స్నేహ రెడ్డి .. అభిమానులతో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ముచ్చటిస్తూనే ఉంటుంది. తన భర్త పిల్లలకు సంబంధించిన విషయాలపై ఎప్పుడూ ఏదో ఒక విషయాన్ని చెప్పుకు వస్తూనే ఉంటుంది. రీసెంట్గా సోషల్ మీడియాలో స్నేహ రెడ్డికి సంబంధించిన ఒక విషయం బాగా ట్రెండ్ అవుతుంది.

స్నేహ రెడ్డి అందంగా ఉండటమే కాదు .. ఫిట్నెస్ పై కాన్సన్ట్రేషన్ చేయడమే కాదు.. ఆమెలో మరో యాంగిల్ కూడా ఉందట . ఆమె మంచి సింగర్ అట . బయట ఎక్కడా కూడా పెద్దగా మాట్లాడని స్నేహారెడ్డి మంచి సింగర్ అన్న విషయం తెలుసుకొని అభిమానులు షాక్ అయిపోతున్నారు. అంతేకాదు కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్ లో తప్పిస్తే ఎక్కడా కూడా పాటలు పాడదట . ఆమె పాడిన పాటలు చాలా బాగుంటాయట . మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ ఆమె పాటకు ఫిదా అయిపోతుందట. హస్కీ వాయిస్ గల స్నేహ రెడ్డి చాలా అద్భుతంగా పాటలు పాడుతుంది అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!