మహేష్ కి ఫోన్ చేసి ఆ విషయాన్ని ఓపెన్ గా చెప్పేసిన ఎన్టీఆర్.. సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న లేటెస్ట్ న్యూస్..!

సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. కొందరు పైకి బాగా కనిపించేస్తారు.. వాళ్ళు ఫ్రెండ్స్ అని ఈజీగా చెప్పేయొచ్చు .. మరి కొందరు మాత్రం చాలా రిజర్వ్డ్డ్ గా ఉంటారు . అసలు వాళ్లు ఫ్రెండ్స్ అని చెప్పుకోవడం చాలా చాలా కష్టం . ఆ లిస్ట్ లోకే వస్తారు మహేష్ బాబు – ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఉండే అందరితోనూ సరదాగా ఉంటారు . మంచి మనసు కల వ్యక్తి. పక్క హీరోల సినిమాల కోసం కూడా సహాయం చేస్తూ ఉంటారు .

పక్క వాళ్ళని ఎదగనివ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి ఎన్టీఆర్ – మహేష్ బాబుకు సరాసరి ఫోన్ చేసి ఓ డైరెక్టర్ గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ – రాజమౌళి ఈ రెండు పేర్లు వింటే జనాలకి నవ్వు ఆగదు . వీళ్లు ఫ్రెండ్స్ కాదు అంతకుమించి .. నిజంగా ఇలాంటి డైరెక్టర్ హీరో ఉంటారని ఆశ్చర్యపోక తప్పదు . ఎన్టీఆర్ కి ఎన్ని హిట్స్ ఇచ్చారో రాజమౌళి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .

ఎన్టీఆర్ రాజమౌళి చాలా సరదాగా ఉంటారు. ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి గురించి ఎన్టీఆర్ ఎలాంటి ఫన్నీ కామెంట్స్ చేశారో కూడా మనం చూసాం . “ఈయన గారితో వేగడం చాలా కష్టమండి “అంటూ ఓపెన్ గానే చెప్పేశారు. అయితే ఇదే విషయాన్ని మహేష్ బాబు తో కూడా సరదాగా చెప్పుకొచ్చారట . “నువ్వు రాజమౌళితో సినిమాకి కమిట్ అవుతున్నావ్ .. ఇక నీతో మాట్లాడటం మాకు పెద్ద కష్టమైపోతుంది.. నువ్వు మాకు దొరకవు ..మూడేళ్లు అంటాడు ఐడు ఏళ్లు సినిమాను తెరకెక్కిస్తాడు.. చేసిన స్టెప్స్ మళ్ళీ చేపిస్తాడు ..పిచ్చెక్కించేస్తాడు.. ఆయన పెద్ద మెంటలోడు.. జాగ్రత్త ..మహేష్ జాగ్రత్త “అంటూ సరదాగా రాజమౌళి గురించి చెప్పుకొచ్చారట. ఆశ్చర్యం ఏంటంటే ఈ విషయం రాజమౌళికి కూడా తెలుసట . ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!