ప్రెగ్నెన్సీ స్త్రీలలో మలబద్ధకం ఏర్పడిందా.. అయితే ఇలా తరిమికొట్టండి..!

గర్భంతో ఉన్నప్పుడు మహిళలను వేధించే సాధారణ సమస్యలలో మలబద్ధకం ఒకటి. శరీరంలో జరిగే హార్మోన్స్ ప్రభావం కారణంగా మలబద్ధకం ఏర్పడుతుంది. ఇక కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మలబద్ధకం తగ్గుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వేడి నీటిలో నిమ్మరసం కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

అదేవిధంగా నిమ్మరసంలో తేనె కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి కూడా. వీటిలో ఉండే గుణాల కారణంగా మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఇక నారింజలు డైటరీ ఫైబర్ మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. క్రమం తప్పకుండా ప్రతి రోజు నారింజ తినడం ద్వారా జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ప్రూనే జ్యూస్ జీర్ణం వ్యవస్థను ఆరోగ్యంగా మారుస్తుంది.

ఇందులో ఉండే గుణాల కారణంగా మలబద్ధకం తగ్గుతుంది. ఇక అవిసె గింజలు గర్భిణీ స్త్రీలకు ఎంతో ముఖ్యం. వీటిని తినడం ద్వారా మలబద్ధకం సమస్యలు నివారించడంతోపాటు అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇక కివి పండ్లను తీసుకోవడం ద్వారా కూడా మలబద్ధకం తొలగిపోయి మంచి పోషకాలు మీ ఆరోగ్యానికి అందుతాయి. పైన చెప్పిన ఫ్రూట్స్ని తీసుకుని గర్భిణీ స్త్రీల లో నుంచి మలబద్ధకాన్ని తరిమి కొట్టండి.